'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ వారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో పలు భాషల్లో నిర్మిస్తున్న 'సాహో' చిత్ర టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ 'సాహో' టీజర్ 'బాహుబలి 2' చిత్రం విడుదలవుతున్న అన్ని థియేటర్స్ లో ప్రదర్శిస్తారు. ప్రభాస్ మూడున్నరేళ్లు బాహుబలి చిత్రానికి కష్టపడిన తర్వాత వస్తున్న అతి పెద్ద భారీ బడ్జెట్ చిత్రం 'సాహో' కావడంతో ఈ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక సుదీర్ఘ కాల ప్రయాణం తర్వాత ప్రభాస్ నటించిన 'బాహుబలి' చిత్రం కూడా రేపే విడుదల కాబోతుంది. ఈ చిత్ర రిజల్ట్ ఎలా వున్నా అందులో నటించిన ప్రభాస్ కి మాత్రం ఎనలేని పేరు ప్రతిష్టలు రావడం ఖాయమని మొదటి భాగంలోనే అర్ధమయ్యింది..
ఇక బాహుబలి తర్వాత వస్తున్న చిత్రం కావడంతో 'సాహో' గురించే ఇప్పుడందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ టీజర్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని అంటున్నారు. ప్రభాస్ రక్తం కారుతున్న మొహంతో కూర్చుని ఉండగా... ఆ రక్తం చూస్తేనే అర్ధమవుతుందిరా... వాడిని చచ్చేంతగా కొట్టారని సైడ్ విలన్ వాయిస్ అనగా..... అతని అసిస్టెంట్ సార్ అది వాడి రక్తం కాదు మనవాళ్లది అనగా... అంతలో ప్రభాస్....తన మొహం మీద రక్తాన్ని తుడుచుకుంటూ 'ఇట్స్ షో టైమ్' అని చెప్పే డైలాగ్ చూస్తుంటే 'సాహో' చిత్రాన్ని సుజిత్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో అర్ధమవుతుంది. సినిమా మొదలయిన కొన్ని రోజుల్లో ఇలా టీజర్ విడుదల చేసి ప్రభాస్ రేంజ్ ని మరోసారి గుర్తు చేశాడు.
ఇక 'సాహో' బ్యాగ్రౌండ్ స్కోర్ అదీ చూస్తుంటే హాలీవుడ్ చిత్రాలను తలదన్నే రీతిలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారని అర్ధమవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అప్పుడే హై ఎక్సపెక్టషన్స్ వున్నాయి.