Advertisementt

బాబూ.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోవద్దు..!

Fri 28th Apr 2017 07:20 PM
ap cm,chandrababu naidu,seethadevi and vote bank,ap cm chandrababu  బాబూ.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోవద్దు..!
Chandrababu Don't Decrease Yours Level బాబూ.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోవద్దు..!
Advertisement
Ads by CJ

చంద్రబాబునాయుడు చాలా తెలివైన వ్యక్తి. చాణక్యుడు. ఆచితూచి మాట్లాడుతాడు. కానీ ఈమధ్య ఆయన వయసు మీద పడిన ప్రభావమో, చాదస్తమో లేక అసహనమో తెలియడం లేదు కానీ ఆయన తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆ మధ్య ఎవరు మాత్రం దళితునిగా పుట్టాలనుకుంటారు? అని అన్నాడు. ఆ తర్వాత కోడలు మగబిడ్డను కంటానంటే ఏ అత్త మాత్రం ఎందుకు వద్దంటుంది? అని అర్ధహేతుకమైన వ్యాఖ్యలు చేశాడు. 

మరోసారి తన సామాజిక వర్గానికి చెందిన వారు తమ జనాభాను పెంచుకోవాలని, తద్వారా బలమైన ఓటు బ్యాంకుగా మారాలన్నాడు. ఇంకోసారి మురికివాడల్లో పుట్టిన వారికి మురికి బుద్దులే వస్తాయన్నాడు. సమయాలు, సందర్భాలు వేరు కావచ్చు... కానీ ఆయన స్థాయి వ్యక్తులు చేయాల్సిన వ్యాఖ్యలు కావవి. ఇక తాజాగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు మద్దతుగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సీతాదేవి తన శీలాన్ని నిరూపించుకున్నట్లుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి తాము ఎన్నికలలో నిరూపించుకోవడం ఏమిటని? వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 

ఆయన మాటలు, సీతాదేవి ప్రస్తావన తేవడం అభ్యంతరకరం. కానీ ఇప్పుడు చంద్రబాబు మాటతీరును చూస్తున్న వారికి ఏమనిపిస్తోదంటే.. ఆయన ముందుగా కొందరి చేత స్పీచ్‌లు రాయించుకొని, ఓ ట్యూషన్‌ మాస్టార్‌కి ఆ బాధ్యతలు అప్పగిస్తే మంచిదనిపిస్తోంది....! బాబూ.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోవద్దు....! 

Chandrababu Don't Decrease Yours Level:

AP Chief Minister Chandrababu Naidu very Intelligent person. But recently Chandrababu Naidu sensational comments on Dalit Peoples, Vote bank and Seethadevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ