Advertisementt

రోజా కూడా ఒక్క ఛాన్స్ అడుగుతోంది!

Fri 28th Apr 2017 09:25 PM
chiranjeevi,roja,meelo evaru koteswarudu movie,uyyalawada narasimha reddy  రోజా కూడా ఒక్క ఛాన్స్ అడుగుతోంది!
Roja Attends Chiranjeevi MEK Show రోజా కూడా ఒక్క ఛాన్స్ అడుగుతోంది!
Advertisement
Ads by CJ

నిన్నటితరం హీరోయిన్లలో రోజాది ఓ ప్రత్యేక స్థానం. కాగా ఆమె చిరుతో కలిసి 'ముఠామేస్త్రి, బిగ్‌బాస్‌, ముగ్గురు మొనగాళ్లు' చిత్రాలలో నటించింది. ఇక 'బిగ్‌బాస్‌'లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి, రోజాలు రాజకీయ ప్రత్యర్ధులు, రోజా అయితే చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ ల పేరెత్తితేనే కస్సుమని లేస్తుంది. కాగా ప్రస్తుతం రోజా మరో మెగాబ్రదర్‌ నాగబాబుతో కలిసి 'జబర్దస్త్‌'లో కలిసి పనిచేస్తుంది. 

ఇక తాజాగా చిరంజీవి హోస్ట్‌గా నడుస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి రోజా గెస్ట్‌గా వచ్చింది. ఇక చిరు, రోజాలు వీరలెవల్లో పాత హిట్‌ సాంగ్స్‌కి స్టెప్పులేశారు. కామెడీ అదరగొట్టారు. ఇక రోజా మాట్లాడుతూ, మరలా మీతో నటించే అవకాశం ఎప్పుడు? అని చిరుని అడగటం, త్వరలో చాన్స్‌ వస్తే కలసి నటిద్దామని చిరు చెప్పడం చాలా మందికి సంతోషాన్ని కలిగించింది. 

ఇక నానికి సైకిల్‌ నుంచి మీలో ఎవరు కోటీశ్వరుడులో తన గెస్ట్‌ల కోరికలను తీరుస్తున్న చిరు తన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'లో రోజాకి ఏమైనా చాన్స్‌ ఇస్తాడేమో చూడాలి...! ఎందుకంటే ఇందులో ఓ సీనియర్‌ హీరోయిన్‌కి సైతం కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క రాయలసీమ యోధుడైన 'ఉయ్యాలవాడ'కి చెందిన రాయలసీమ ఆడబిడ్డ రోజా. సో.. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ...!

Roja Attends Chiranjeevi MEK Show:

Senior heroine Roja appeared in the MEK show. Roja directly asked Chiru that 'When will I get a chance to act with you again ?'.. Chiru answered that 'It may happen soon if things fall in place'. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ