బాహుబలి ద బిగినింగ్లో పాలమెరుపులు మెరిపించిన తమన్నాకి మంచి పేరొచ్చింది. అందులో ప్రభాస్ తో కలిసి నటించిన రొమాంటిక్ సాంగ్ కి విపరీతమైన ఆదరణ లభించింది. కొన్ని సన్నివేశాల్లో ఎంతో గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక మొదటి పార్ట్ లో అనుష్కని డీ గ్లామర్ గా చూపించిన రాజమౌళి బాహుబలి ద కంక్లూజన్ లో మాత్రం అనుష్క రోల్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తమన్నాని పెద్దగా పట్టించుకోలేదు. అసలు ప్రాముఖ్యత లేని కొన్ని సన్నివేశాల్లో నటించింది రెండో పార్ట్ లో తమన్నా. అయితే రెండో పార్టులో తమన్నాకి పెద్దగా ప్రాముఖ్యత లేనికారణంగానే తమన్నా బాహుబలి ప్రమోషన్స్ లో ఎక్కడా పాల్గోలేదని....ప్రచారం మొదలైంది.
కేవలం తెలుగులో జరిగిన బాహబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనబడిన తమన్నా మళ్ళీ ఏ ఇంటర్వ్యూలో కనబడలేదని... పార్ట్ 2 లో తన కేరెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోవడం వల్లనే తమన్నా ఇలా చేసిందని అంటున్నారు. అయితే ఈ ప్రచారానికి స్పందించిన తమన్నా తనకు రాజమౌళిగారంటే కోపం లేదని... తనకు ఆయనంటే ఎంతో గౌరవమని.... నాకు సినిమా షూటింగ్ ఉండడం వల్లనే బాహుబలి ప్రమోషన్స్ లో కొన్నింటిలో పాల్గొనలేక పోయానని చెబుతుంది. ఇక రాజామౌళిగారి అనుమతి కూడా తీసుకున్నానని గాసిప్స్ కి క్లారిటీనిచ్చింది.