ఆదివారం నుండి సోషల్ మీడియాలో ఒకే పిక్ ట్రెండ్ అవుతుంది. అదేమిటంటే అల్లు శిరీష్ తో అఖిల్ మాజీ లవర్ శ్రియ భూపాల్ క్లోజ్ గా వున్న ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. అఖిల్ తో బ్రేకప్ అయ్యాక శ్రియ భూపాల్ ఒక ఎన్నారై కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఇక శ్రియ తో పెళ్లి బ్రేకప్ అయ్యాక ఆ విషయాలు గురించి ఎక్కడా స్పందించలేదు అఖిల్. ఇక ఇప్పుడు తాజా గా మెగా హీరో అల్లు శిరీష్ తో శ్రియ భూపాల్ ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తూ క్లోజ్ గా మూవ్ అవ్వడాన్ని అనేకరాకారులుగా పెడర్ధాలు తీస్తూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంతో అల్లు శిరీష్ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
నా ఫ్రెండ్ శరత్ రెడ్డి మరియు నా బేబి సిస్టర్ శ్రీయతో వీకెండ్ ని ఎంతో ఎంజాయ్ చేశాను... అంటూ శ్రీయతో శరత్ రెడ్డితో కలిసి ఉన్న సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. శిరీష్. అంటే శ్రియ తనకు సిస్టర్ లాంటిదని ... అల్లు శిరీష్ పెట్టిన ఒక్క పోస్ట్ తో అందరికి దాదాపు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పాపం నిజంగా అల్లు శిరీష్ ఇలా సకాలంలో స్పందిన్చకపోతే గనక వీరి రిలేషన్ షిప్ పై అనేక రకాల గాసిప్స్ ప్రచారం అయ్యేవి.