తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా పెట్టుబడిదారులపై, మీడియాపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. తనకు అనుకూలంగా ఓ చానెల్‌ను, పత్రికను వెనకుండి నడిపిస్తున్నారు. కానీ ఆ మీడియా కేవలం తెలంగాణకే పరిమితం కావడంతో తన ఖ్యాతిని రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చాటుకోవాలని చూస్తున్న కేసీఆర్ ఏపీలో కూడా మంచి సర్క్యులేషన్ ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై కూడా కన్నేశారు. ఆఫ్ట్రాలు ఎంపీలు, ఆఫ్ట్రాలు సీఎంలు అనే దోరణిలో ఉండే కింగ్‌మేకర్, మీడియా మొఘల్ రామోజీరావు కూడా మొట్టమొదటి సారిగా కేసీఆర్ దగ్గరకు వచ్చాడు.
కేసీఆర్ కూడా రామోజీతో దోస్తీ అన్నాడు. అయన అడిగిందే తడవుగా ఆధ్యాత్మిక నగరానికి స్థలం కేటాయించాడు. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తోందని, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని ఆయన కొంతకాలం రాధాకృష్ణపై కోపం పెంచుకున్నారు. తాజాగా జ్యోతి ఆఫీసులో జరిగిన ప్రమాద ఘటనపై ఫోన్‌లో ఆరా తీయడమే కాదు.. స్వయంగా ఆంధ్రజ్యోతి ఆఫీసుకు మంత్రులతో సహా వెళ్లాడు. ఇలా కేసీఆర్ మీడియాపై ఇప్పుడు తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఇక మీడియాకు ఉన్న ప్రాధాన్యం, తన అన్నయ్య 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టినప్పుడు ఏ మీడియాను పెద్దగా చేరదీయకపోవడం చూసిన పవన్ ఆ మధ్య ఈటీవీ ఫంక్షన్‌కి హాజరయ్యాడు.ప్రస్తుతం ఆయన కూడా ఆంధ్రజ్యోతి ఆఫీసును సందర్శించాడు. మరోవైపు కేవలం తనకు ఒక్క సాక్షి మాత్రమే ఉంటేచాలదని భావించిన జగన్ తన తండ్రికి బద్దవిరోధి రామోజీని కలిశాడు. అప్పటి నుంచి ఈనాడులో, ఈటీవీలో జగన్ పట్ల కాస్త సానుకూలత ఏర్పడింది. ఇక రాధాకృష్ణకు కూడా కలిసే పనిలో జగన్ ఉన్నాడు. ఇప్పటికే జగన్ ఓసారి రాధాకృష్ణని కలవాలని భావించి, భంగపడ్డాడు అనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.