కృష్ణవంశీ డైరెక్షన్ లో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'నక్షత్రం'. ఈ చిత్రం ఫైనాన్స్ ప్రొబ్లెమ్స్ వల్ల షూటింగ్ చాలా డిలే అవుతూ వచ్చింది. అయితే కృష్ణవంశీ ఈ సినిమాకి బాగా హైప్ తీసుకురావడానికిగాను సాయి ధరమ్ తేజ్ తో, ప్రగ్య జైస్వాల్ తో గెస్ట్ రోల్స్ కూడా చేయించాడు. కానీ ఆ సినిమాపై అంచనాలను మాత్రం పెంచలేకపోయాడు కృష్ణవంశీ. కారణం కృష్ణవంశీ చిత్రాలు వరుసగా ప్లాపులవడం వల్ల. అయితే 'నక్షత్రం' చిత్రం షూటింగ్ త్వరలోనే ముగించేసి మే నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు 'నక్షత్రం' సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే 'నక్షత్రం' చిత్రంలో శ్రీయ శరణ్ ఒక ఐటెం సాంగ్ చేస్తుందని చెబుతున్నారు. మరి శ్రీయ తన ఒంపుసొంపులతో 'నక్షత్రం' ఐటెం లో నర్తింప చేస్తే అయినా ఈ సినిమాకి అంచనాలు పెరుగుతాయని భావించి కృష్ణవంశీ.. శ్రీయ ని అప్రోచ్ అయినట్లు చెబుతున్నారు. మరోపక్క శ్రీయకి ఐటమ్స్ లో నర్తించిన అనుభవం కూడా ఉంది. శ్రీయ కొన్ని చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో నటించి మెప్పించింది. మరి శ్రీయ రాకతోనైనా కృష్ణవంశీ నక్షత్రం ప్రొబ్లెమ్స్ తీరుతాయేమో చూద్దాం...!