Advertisementt

నాకెన్నో రూపాలు.. కోపాలు.. కానీ..!

Mon 08th May 2017 08:19 PM
kathalo rajakumari,kathalo rajakumari teaser,nara rohith,naga shourya,namitha pramod,nanditha  నాకెన్నో రూపాలు.. కోపాలు.. కానీ..!
Kathalo Rajakumari Movie Teaser Report నాకెన్నో రూపాలు.. కోపాలు.. కానీ..!
Advertisement
Ads by CJ

ఆ మధ్యన 'కథలో రాజకుమారి' అంటూ ఫస్ట్ లుక్ తో హంగామా చేసి ఆసక్తి రేకెత్తించిన నారా రోహిత్ ఇప్పుడు 'కథలో రాజకుమారి' టీజర్ తో డీసెంట్ గా వచ్చేశాడు. 'కథలో రాజకుమారి' అంటూ చందమామ కథలతో పోలిక ఉన్న ఈ టైటిల్ ని చూస్తుంటే నారా రోహిత్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టేలాగే కనబడుతున్నాడు. 'జ్యో అచ్యుతానంద' చిత్రంలో నాగ సౌర్య తో స్క్రీన్ షేర్ చేసుకుని డీసెంట్ గా హిట్ కొట్టిన నారా రోహిత్ మరో సారి నాగ సౌర్యతో ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేయిస్తూ ప్రేక్షకులని అలరించడానికి త్వరలోనే రాబోతున్నాడు.

ఒక నిమిషం నిడివిగల టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ టీజర్ లో 'నాకెన్నో రూపాలు.... నాకెన్నో కోపాలు..... కానీ ఒక్కటే ప్రేమ అంటూ నారా రోహిత్ డైలాగ్ తో స్టార్ట్ అయిన కథలో రాజకుమారి టీజర్ లో హీరో రోహిత్, హీరోయిన్ నందిత, నమిత ప్రమోద్, అతిధి పాత్రలో మెరవనున్న నాగ సౌర్యని లను పరిచయం చేస్తూ... అంత ఈజీనా మనల్ని ప్రేమించే వారిమీద పగ తీర్చుకోవడం... ప్రేమ, పగని మిగిలిన ఎమోషన్స్ లా వీటిని అందరితో పంచుకోలేం....' అంటూ చెప్పే డైలాగ్ ఆధ్యంతం అద్భుతం అనిపించింది. ప్రేమా నాదే పగా నాదే అంటూ అన్ని రకాల ఎమోషన్స్, కామెడీ, ప్రేమ, పగ వంటి కలయికతో 'కథలో రాజకుమారి' టీజర్ ఆసక్తిని కలిగించి అంచనాలు పెంచేసింది.    

Click Here See the Kathalo Rajakumari Teaser

Kathalo Rajakumari Movie Teaser Report:

Nara Rohit’s fresh romantic and action outing Kathalo Rajakumari teaser is released just now by the makers. Director of the film is Mahesh Surapaneni while Namitha Pramod, Naga Shourya and Nanditha are in other main leads.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ