నిన్నటితరం హీరోలతో పోలిస్తే నేటి తరం యంగ్‌స్టార్స్ చాలా ఫ్రెండ్లీగా ఒకరినొకరు మూవ్ అవుతుంటారు. కానీ ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబుల తరహాలో మల్టీస్టారర్స్ చేయకపోయినా కూడా వారు తమలో తాము మంచి ఫ్రెండ్స్‌గా ఉంటారు. కాగా నిన్నటి వరకు మెగాభిమానులకు, నందమూరి అభిమానులకు ఒక్కక్షణం పడేది కాదు. చిరు, బాలయ్యల అభిమానులు రోడ్డునపడి కొట్టుకున్న సందర్భాలున్నాయి.
ఇక ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ప్రభాస్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో పవన్, ప్రభాస్‌ల అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ ఒకరి బేనర్లను ఒకరు కాల్చివేయడం, కొట్టుకోవడం వంటివి చేస్తున్నారు. వీరి సినిమాలు విడుదల అంటే ఈ ఇద్దరి అభిమానుల పుణ్యమా అని పోలీసులకు నిద్ర ఉండదు. కానీ పవన్ ఆ తప్పుడు ఊహలకు చెక్‌పెట్టే ప్రయత్నం చేశాడు.
'బాహుబలి' చిత్రం సంచలనం సృష్టిస్తున్న సందర్భంగా ప్రభాస్‌ని శ్రీ ప్రభాస్‌గారు అని పిలిచి తన గొప్పతనం చాటుకుని, ప్రభాస్‌ని మిగిలిన యూనిట్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు. వాస్తవానికి పవన్, ప్రభాస్, మహేష్ వంటి నేటితరం యంగ్‌స్టార్స్ కులాలు, గొడవలు, రికార్డులను పెద్దగా పట్టించుకోరు. తమ పని తాము చేసుకుపోతుంటారు. మరి వారి మద్య ఏమీ లేనప్పుడు వారి అభిమానులు మాత్రం రెచ్చిపోయి వీధులకెక్కడం తగదు..!