Advertisementt

మే 19 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్..!

Wed 10th May 2017 02:26 PM
jr ntr,jai lava kusa movie,director bobby,producer kalyan ram,ntr birthday on may 20th,first look launch 19th may 2017  మే 19 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్..!
Jai Lava Kusa Movie First Look Launch మే 19 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాణ సారధ్యంలో 'జై లవ కుశ' చిత్రంలో నటిస్తున్నాడు. మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒక రోల్ లో విలన్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. మొదటి సారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయి చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర కీలక షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో ఒక భారీ బంగ్లా సెట్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో సినిమాకి అతి ఇంపార్టెంట్ అయిన ఇంటర్వెల్ సీన్స్ షూట్ చేస్తారని.... ఆ సన్నివేశాలు హెవీ యాక్షన్ తో కూడి ఉంటాయని చెబుతున్నారు.

ఇక 'జై లవ కుశ' కి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా మే 20  విడుదల చేస్తామని సినిమా ఆరంభం నుండి చేబుతున్నారు. 'జై లవ కుశ' ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ మూడు గెటప్స్ ను మిక్స్ చేస్తూ స్పెషల్ గా డిజైన్ చూపిస్తున్నారని సమాచారం. మరి మే 19  నే ఈ 'జై లవ కుశ' ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యాలని... అంటే ఎన్టీఆర్ బర్త్ డే ఒక రోజు ముందే ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నా, నివేత థామస్, నందిత లు నటిస్తున్నారు.

Jai Lava Kusa Movie First Look Launch:

Hero NTR, Bobby Direction is doing Kalyan Ram Producer in the film 'Jai Lava Kusa'. The first look of 'Jai Lava Kusa' is from NTR's birthday gift May 20 is being released from the start of the film. NTR's birthday is expected to release the first look one day before the film unit is supposed to give fans a surprise.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ