అంబేడ్కర్ రాజ్యాంగం రాసే సమయానికి ఆనాడు దేశంలో ఉన్న వివక్షత, దళితులపై అరాచకాలు వంటివి దృష్టిలో ఉంచుకుని దళితులకు రిజర్వేషన్లు కల్పించాడు. తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వంటివి వచ్చాయి. కానీ నాడే అంబేడ్కర్ రిజర్వేషన్లను పెంచుతూ పోవడం వల్ల ఎన్ని అనర్థాలుంటాయో కూడా చెప్పాడు. కానీ మన నాయకులు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇప్పటికీ వాటిని పొడిగిస్తూనే ఉన్నారు.
రిజర్వేషన్లను క్రిమిలేయర్ ఆధారంగా ఏర్పాటు చేయాలని, అగ్రవర్ణాలలోని పేదలకు కూడా సాయం చేయాలని, రిజర్వేషన్లకు ఒకతరం వారికే అప్పగించేలా చూడాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. కావాలంటే ఎస్సీ,ఎస్టీలకు ఉచితంగా విద్య, శిక్షణ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక రిజర్వేషన్లు అనేది మన దేశంలో దారుణంగా విఫలమైందని, కాబట్టి వేరే మార్గాలను అన్వేషించాలని కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి.
ఇక పచ్చి వాస్తవం ఏమిటంటే, గృహహింస చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 90శాతం దుర్వినియోగమవుతున్నాయి. తమ ప్రతికారాలకు వీటిని వాడుకుంటున్నారు. ఇక కోల్‌కత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్ ఏకంగా సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు సుప్రీం న్యాయమూర్తులకు జైలు శిక్ష విధించాడు. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి వారికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి.