ఇప్పడు నిర్మాతలంతా బాహుబలి సీరీస్ ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అతి పెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కిన బాహుబలి పెట్టుబడి పెట్టిన మొత్తానికి నాలుగింతలు సంపాదించే దిశగా పరుగులు పెడుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో 'మగధీర, బాహుబలి' వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు చాలా ప్రాఫిట్ వెనకేసుకున్నారు. అందుకే ఇప్పుడు నిర్మాతలంతా భారీ ప్రాజెక్టుల వెంట పడుతున్నారు. ఇప్పటికే ఒక ఎన్నారై సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూ. 1000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ‘మహాభారత' ని అనౌన్స్ చేశారో లేదో ఇప్పుడు టాలీవుడ్ లో అపార చాణిక్యునిగా పేరు మోసిన అల్లు అరవింద్ మరో ఇద్దరితో కలిసి 500 కోట్ల భారీ వ్యయంతో సంపూర్ణ రామాయణాన్ని తీస్తానని చెబుతున్నాడు.
పురాణ గాధ రామాయణాన్ని ఆలు అరవింద్,నమిత్ మల్హోత్ర, మధు మాతేన తో కలిసి మూడు పార్టులుగా నిర్మించనున్నట్టు సమాచారమందుతుంది. అయితే ఈ రామాయణాన్ని త్రీడి వెర్షన్ లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇక ఈ మూడు పార్టులను 500 కోట్ల భారీ వ్యయంతో తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ లో తెరకెక్కించి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక పోతే ఈ అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే నవంబర్ లో గ్రాండ్ గా లంచ్ చేసి పట్టాలెక్కించేందుకు సిద్ధం చేస్తున్నారని వినికిడి. అప్పటిలోగా రామాయణం మూడు పార్టులలో నటించే నటీనటుల ఎంపిక పూర్తి చేస్తామని కూడా చెబుతున్నారు.