సోషల్‌మీడియాలో 'పొలిటికల్ పంచ్' నిర్వాహకుడు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, తనయుడు లోకేష్‌లను, శాసనమండలిని ఎగతాళి చేస్తూ పంచ్‌లు వేస్తున్నాడని ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. ఇక దీంతో రవికిరణ్ కాస్త తగ్గాడు. పెద్దల సభ గురించి వ్యంగ్యంగా మాట్లాడటం తప్పని తనకు తెలియదని, అందుకే కొందరు చెప్పిన తర్వాత దానిని డిలేట్ చేశానన్నాడు. ఇక పెద్దల సభపై వ్యంగ్యంగా స్పందించినందుకు చివరకు మీడియా మొఘల్ రామోజీరావు సైతం క్షమాపణలు చెప్పాడు అని పొలిటికల్ పంచ్ వ్యక్తికి తెలియకపోవడం తప్పు కానీ ఇప్పుడు దళిత ఎమ్మెల్యే అయిన అనిత ఫిర్యాదుతో రవికిరణ్‌ను విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసారి ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.
ఇంతకీ ఆయన చేసిన తప్పేమిటంటే...ఆమధ్య ఒకసారి ఎమ్మెల్యే అనిత తెలుగుదేశం హయాంలో జరుగుతున్న అభివృద్ది ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించింది. దానికి పొలిటికల్ పంచ్‌లో రాష్ట్రం అభివృద్ది ఏమో తెలియదు కానీ మీ అభివృద్ది(లావుగా మారడం) కనిపిస్తూనే ఉందని పంచ్ పడింది. దీంతో దళిత ఎమ్మెల్యేనైన తనపై ఇలా పంచ్ వేసినందుకు ఆమె ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. కాగా అదే సమయంలో పొలిటికల్‌పంచ్‌లో 'ఒకప్పుడు తెలుగురాష్ట్రం 23 జిల్లాలతో లోకేష్‌లాగా బొద్దుగా ఉండేదని, ఇప్పుడు 13 రాష్ట్రాలతో లోకేష్‌లా స్లిమ్‌గా మారిందని సెటైర్ వేశాడు. మరి లోకేష్ మీద పంచ్ వేస్తే కేవలం ఆయన అధికారం ఉపయోగించుకుంటున్నాడు.
కానీ అనిత మాత్రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాకా వెళ్లింది. కాగా గతంలో వైజాగ్‌లో బికినీ ఫెస్టివల్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ తీవ్ర విమర్శలతో అది రద్దయింది. ఆ సందర్భంగా అనిత... మహిళలు బికినీ వేస్తే తప్పేంటని వ్యాఖ్యానించింది. ఇది తెలుగు సంప్రదాయాలను, భారతీయ సంస్కృతిని నాశనం చేయడమేనని ఎవరైనా కోర్టుకు వెళ్లితే అనిత ఏం చేస్తుంది? సామాన్య తెలుగు మహిళలను ఆమె అలా అవమానిస్తే ఎలా? ఇలా అరెస్ట్‌లు చేస్తుంటే నేటి జనరేషన్‌కు సంబంధించిన ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్‌పై ఇప్పటికే ఎన్నో కేసులు నడుస్తూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది...!