150 వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టే హిట్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు తన తదుపరి చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ని పట్టాలెక్కించేపనిలో బిజీగా వున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' చిత్రం హిట్ అయ్యాక చిరు బుల్లితెర మీద కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ సందడి చేస్తున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' తో వచ్చిన క్రేజ్ ని కంటిన్యూ చేయడం కోసమే ఈ షో చేస్తున్నాడేమో అనే అనుమానాలు మొదట్లో చిరు పై వచ్చాయి. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో చిరు కొంత విమర్శల పాలైనా క్రమేణా పుంజుకుని క్రేజ్ బాగానే సంపాదించాడు.
ఇక ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి చిరు బ్రేక్ ఇవ్వనున్నాడట. అయితే తన 151 వ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా వుండడంతోనే ఇలా మీలో ఎవరు కోటీశ్వరుడు కి చిరు బ్రేక్ ఇస్తున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఆగష్టు లో మొదలై సెట్స్ మీదకెలుతుందని చెబుతున్నారు. అందుకోసమే ఈ మే నెలాఖరు నుండి మీలో ఎవరు కోటీశ్వరుడు కి చిరు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఇక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ ఉయ్యాలవాడ... చిత్రానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి. భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.