బాలకృష్ణ ఈ మధ్యన అందరికి షాక్ ల మీద షాకులిస్తున్నాడు. తన 101వ చిత్రానికి పూరీని డైరెక్టర్ ని చేసి షాకిచ్చిన బాలయ్య అప్పుడే 102 వ చిత్రాన్ని లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ 102 వ చిత్రాన్ని బోయపాటి శ్రీను తీస్తాడని అనుకున్నారంతా... కానీ ఇప్పుడు బాలయ్య, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాను అధికారికంగా ప్రకటించేశాడు. పూరి చిత్రం కంప్లీట్ కాకముందే వీరి కాంబినేషన్లో తెరకెక్కే మూవీ సెట్స్ మీదకెళుతుందట. అంటే వచ్చే నెల చివరిలో మొదలయ్యే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జులై నుండి జరుపుకోనుంది. అయితే కేఎస్ రవికుమార్ చెప్పిన కథని బాలయ్య వెంటనే ఒకే చేసినట్లు వార్తలొస్తున్నాయి.
బాలకృష్ణ ఈ కథని విన్న వెంటనే ఒప్పుకోవడానికి ఒక కారణం ఉందట. అదేమిటంటే కేఎస్ రవికుమార్ ఆ కథని రజినీకాంత్ కోసం రాసుకున్నాడట. కానీ రజినీకాంత్ ఇప్పుడు రోబో 2 .0 చిత్రం అవ్వగానే కబాలి కాంబినేషన్ మరలా రిపీట్ చేస్తూ రంజిత్ ప డైరెక్షన్ లో నటించేందుకు సిద్ధం గా వున్నాడు. అందుకే రజిని డేట్స్ ఖాళీ లేకపోవడం వలెనే ఆ కథతో బాలకృష్ణ తో అయినా చేసి హిట్ కొట్టాలని కేఎస్ రవికుమార్ అనుకోబట్టే ఆ కథ బాలయ్య దగ్గరికి వచ్చిందట. కేఎస్ రవికుమార్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. కానీ వీరి కాంబోలో రీసెంట్ గా వచ్చిన లింగా మాత్రం డిజాస్టర్ అయ్యింది.
ఇక కేఎస్ రవికుమార్ టేకింగ్, కథ చెప్పిన తీరు నచ్చడం... కథ కూడా బలంగా ఉండడంతో బాలకృష్ణ వెంటనే ఒకే చేసేశాడని టాక్ వినబడుతుంది. అలా రజినీకాంత్ చెయ్యాల్సిన కథ బాలకృష్ణ చేతికొచ్చిందన్నమాట.