Advertisementt

నిజమా..రాజమౌళి నెక్స్ట్ మూవీ ఈ స్టార్ తోనా!

Sat 13th May 2017 01:50 PM
mahesh babu,director rajamouli,producer kl narayana,mahesh and rajamouli combo movie  నిజమా..రాజమౌళి నెక్స్ట్ మూవీ ఈ స్టార్ తోనా!
Mahesh babu and Rajamouli Combo movie Coming Soon! నిజమా..రాజమౌళి నెక్స్ట్ మూవీ ఈ స్టార్ తోనా!
Advertisement
Ads by CJ

రాజమౌళి డైరెక్షన్ లో పవన్ గాని మహేష్ గాని నటిస్తే చూడాలని ఆయా హీరోల ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ తరుణం ఇంత వరకు రాలేదు. కారణం రాజమౌళి కి తీరిక లేకపోవడం ఒక ఎత్తైతే వారికి సరిపడా స్క్రిప్ట్స్ లేకపోవడం కూడా కారణం కావొచ్చు. ఇక ఇప్పుడు అందులోని ఒక హీరోతో రాజమౌళి సినిమా చేస్తున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో పీక్ కి చేరింది. ఇప్పుడు రాజమౌళి బాహుబలి విజయాన్ని ఆస్వాదిస్తూ భూటాన్ లో ఫ్యామిలీతో సేదదీరుతున్నాడు. ఇక అక్కడి నుండి వచ్చాక రాజమౌళి నెక్స్ట్ చిత్రంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్నట్టు చెబుతున్నారు.

మరి మహేష్ ఇప్పుడు మురుగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ లో నటిస్తుండగా.... తన నెక్స్ట్ మూవీ ని కొరటాల డైరెక్షన్ లో చేస్తున్నాడు. అయితే కొరటాల మూవీ అవ్వగానే రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ నటిస్తాడని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ పూర్తయ్యాక  ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహేష్ తో ఒక సినిమా చెయ్యడానికి కమిట్మెంట్ ఉందని... సో.. త్వరలోనే మా కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఇపుడు పార్ట్ 2  కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి రాజమౌళి, మహేష్ ని డైరెక్ట్ చెయ్యొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి. 

అయితే బాహుబలి తర్వాత ఏదన్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ని తెరకెక్కించిన తర్వాత మహేష్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణకు రాజమౌళి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నారాయణ నిర్మాణ సారధ్యంలో  సినిమా చేస్తానని రాజమౌళి ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా చెయ్యలేదు. ఇప్పుడు బాహుబలి సినిమా విడుదలైంది కాబట్టి  రాజమౌళి నారాయణతో టచ్ లోకి వచ్చి సినిమా చేద్దామని అన్నాడట. అయితే నారాయణకు మాత్రం మహేష్ తో సినిమా చెయ్యాలని అదీ.... రాజమౌళి డైరెక్షన్ లో అని బాగా ఉందట. ఇక దీనికి మహేష్ కూడా సుముఖంగానే ఉండడంతో వచ్చే ఏడాది రాజమౌళి- మహేష్ కాంబినేషన్ లో ఒక చిత్రం  ఖచ్చితంగా వుంటుందనే సంకేతాలు అందుతున్నాయి. 

Mahesh babu and Rajamouli Combo movie Coming Soon!:

Pawan and Mahesh are looking forward to act in Rajamouli direction,and this heroes fans also waiting. After director Koratala Siva film completed Super star Mahesh babu Acted in director rajamouli Film coming soon. This film Producer by K.L. Narayana. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ