వర్మకి ఇగో ఎక్కువ. అలాగే సోకాల్డ్ మీడియా కూడా. మీడియాకు తలవంచి, వినయంగా మాట్లాడటం వర్మకి చేతకాదు. ఇంకేముంది. నేషనల్ మీడియా కూడా వర్మ ఎప్పుడు దొరుకుతాడా? అని వేచిచూస్తూ ఉంటుంది. మరోవైపు వర్మ కూడా మీడియాపై ఎప్పుడు సెటైర్లు వేద్దామా... అని ఎదురుచూస్తుంటాడు. ఇది కోల్డ్‌వార్. కాగా ముంబై బాంబు పేలుళ్ల ఘటన జరిగినప్పుడు నాటి ముంబై ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వెంట వర్మ వెళ్లాడు.
దీంతో మీడియా నానా రచ్చ చేసింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ పార్టీలో వర్మ వోడ్కా తాగుతూ డ్యాన్స్‌లు చేసి సరదా చేయడంతో ఓ ఆటాడుకుంది. దీంతో వర్మకి కూడా మండింది. టీఆర్పీల కోసం మీడియా వారు ఎలాంటి పనులు చేస్తారో చూపిస్తూ 'రణ్' చిత్రం తీశాడు. వాస్తవానికి ఈ చిత్రం బాగానే ఉంది. కానీ మీడియా మాత్రం నానా నెగటివ్ ప్రచారంలో ఈ చిత్రం ఫ్లాప్‌కావడంలో కీలక పాత్ర పోషించింది. ఇక తాజాగా వర్మ మరలా అమితాబ్‌తో 'సర్కార్3' అనౌన్స్ చేసినవెంటనే ఇదో చెత్త సినిమా అని జనాల మెదళ్లలో నాటేసి మొదటి నుంచి నెగటివ్ ప్రచారం చేసింది.
ఇక ఈ సినిమాకు కూడా నెగటివ్ టాక్ వచ్చింది. దాంతో జాతీయ మీడియా, వెబ్‌సైట్లు అన్ని ఈ చిత్రాన్ని చెడుగుడు అడుకుంటున్నాయి. పలు ప్రత్యేక కథనాలు, స్పెషల్ స్టోరీలు ప్రచారం చేస్తున్నాయి. 'సేమ్.. షేమ్.. వర్మ' అంటూ వెక్కిరిస్తున్నాయి. 1.5,2 రేటింగ్‌లు ఇచ్చాయి. దీంతో ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాలను చూసే అవకాశం కనిపిస్తోందంటున్నారు.. పాపం. వర్మ...!