పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్లెల్బీ రీమేక్ లో నటిస్తాడని నిన్నటి నుండి సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది. హారిక - హాసిని క్రియేషన్స్ వారు పవన్ ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా రీమేక్ రైట్స్ ని కోటి డెబ్భై లక్షలు పోసి కొన్నారని ప్రచారం జరుగుతుంది. మరి పవన్ ఇప్పుడు ప్రస్తుతానికి త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ చేతిలో మరో సినిమా వుంది. అది ఏ.ఎమ్ రత్నం నిర్మాతగా నేసన్ డైరెక్షన్ లో ఒక సినిమాకి పవన్ పూజా కార్యక్రమాలు కూడా చేశాడు.
అలాగే నేసన్, తమన్ లతో పవన్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమా ఆగిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ మీద ఇప్పటివరకు నిర్మాత గాని.. హీరో పవన్ గాని స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ జాలీ ఎల్లెల్బీ లో నటిస్తాడని న్యూస్ హాట్ హాట్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఒకవేళ పవన్ గనక జాలీ ఎల్లెల్బీ లో నటిస్తే మాత్రం ఏ ఎమ్ రత్నం సినిమా అటకెక్కినట్టే. చూద్దాం ఏం జరగబోతుందో...!