Advertisementt

సేమ్ సీన్ రిపీట్ అవుతోందిగా...!

Tue 16th May 2017 12:24 PM
jr ntr,jai lava kusa movie,kalyan ram,bobby,cameraman murali dharan  సేమ్ సీన్ రిపీట్ అవుతోందిగా...!
Same Sean Repeat! సేమ్ సీన్ రిపీట్ అవుతోందిగా...!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్, బాబీ కి తన చిత్రం 'జై లవ కుశ' కి డైరెక్టర్ గా చేసే ఛాన్స్ అందరిని ఆశ్చర్యపడేలా చేశాడు. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఎవరన్నా స్టార్ డైరెక్టర్ ని తీసుకుంటాడని అనుకుంటున్న సమయంలో బాబీ ని తన సినిమా డైరెక్టర్ గా ప్రకటించాడు. అయితే బాబీ కూడా ఈ సినిమాకి చాలా శ్రద్ద పెట్టి వర్క్ చేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ నుండి టాలీవుడ్ నుండి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ని బాబీ 'జై లవ కుశ'లో మూడు విభిన్న పాత్రల్లో చూపించబోతున్నాడు. ఇక 'జై లవ కుశ' ఫస్ట్ లుక్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 19 న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరి ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటున్న 'జై లవ కుశ' చిత్రం గురించి ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే 'జై లవ కుశ' కి పనిచేసే ఫెమస్ కెమెరామెన్ మురళీ ధరన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మురళీ ధరన్ చాలా మంది స్టార్ హీరోలకు పనిచేశాడు. అయితే ఇక్కడ డైరెక్టర్  బాబీ కి మురళీ ధరన్ కి వచ్చిన విభేదాలు తారా స్థాయికి చేరడంతో మురళీ ధరన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని చెబుతున్నారు. అయితే 'జై లవ కుశ' టీమ్ మురళీ ధరన్ కి సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో... ఆలోచనలో పడిన చిత్ర యూనిట్ కెమెరామెన్ చోటా కె నాయుడిని సంప్రదించడం ఆయన ఓకె చెయ్యడం జరిగిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

అయితే బాబీ విషయంలో ఇలా కెమెరామెన్స్ బయటికి వెళ్లడం కొత్తకాదు.  గతంలో రవితేజ ‘పవర్’ కి, పవన్‌ కల్యాణ్- ‘గబ్బర్‌సింగ్‌2’ వంటి చిత్రాల్లో బాబీ ఒత్తిడి వల్ల కెమెరామన్లు తప్పుకున్న విషయం తెల్సిందే. మళ్లీ ఇప్పుడు 'జై లవ కుశ' చిత్రానికి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే డైరెక్టర్ కి కెమెరామెన్ కి మధ్యన విభేదాలు రాలేదని..... నిర్మాత కళ్యాణ్ రామ్ బావమరిదికి కెమెరామెన్ కి వచ్చిన విభేదాలే అతను ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కారణమని ఇన్సైడ్ సమాచారం.

 

Same Sean Repeat!:

NTR has done the surprise of all the chances of being the director of the film 'Jai Lava Kusa' to Bobby. A news about the film 'Jai Lava Kusa' is now a social media. Famous cameraman Murali Dharan is reported to have dropped out of this project.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ