Advertisementt

బాబు .. దొంగలకు ఎంత కాలం అవకాశం ఇస్తావు?

Tue 16th May 2017 08:30 PM
chandrababu naidu,ap cm,tdp,ys jagan,ysrcp,sujana choudary,narendra modi  బాబు .. దొంగలకు ఎంత కాలం అవకాశం ఇస్తావు?
Chandrababu Naidu How Long Time Give Chance to Robbers? బాబు .. దొంగలకు ఎంత కాలం అవకాశం ఇస్తావు?
Advertisement
Ads by CJ

ఒకప్పుడు చంద్రబాబునాయుడు సీఎం అయినప్పుడు ఆయనకు నిప్పు అనే పేరుండేది, చండశాసనునిగా పల్లెలకు వెళ్లి, జన్మభూమి వంటి పథకాలను చేపట్టి, ఉద్యోగులలో భయంపెట్టి, క్రమశిక్షణ పెంచాడనే గుర్తింపు ఉంది. ఆనాడు ఆయనపై ఓ వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. తింటే గింటే తానే తింటాడని, కానీ అందరికీ ఆ అవకాశం ఇవ్వడని, తన మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల కఠినంగా ఉంటాడనే పేరుండేది. 

కానీ ఇప్పుడు రూట్‌ మార్చినట్లు కనిపిస్తోంది. ఉద్యోగులలో అలసత్వం, అవినీతిని అరికట్టలేకపోతున్నాడు. ఇక ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మంత్రి వర్గంలో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఎక్కువశాతం మందిపై తీవ్ర ఆరోపణలున్నాయి. కానీ జగన్‌ను ఆర్ధిక నేరస్తునిగా పేర్కోనే ఆయన మాత్రం తన తమ్ముళ్లను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఒకప్పటి కాంగ్రెస్‌, ప్రస్తుత టిడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వందలకోట్లు బ్యాంకులకు రుణం ఎగవేయడంతో సిబిఐ రంగంలోకి దిగడం జరిగింది. నష్టనివారణ చర్యగా బాబు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాడు. 

కానీ ఆయన అవినీతి పరుడని, తన ఎన్నికల్లో సైతం కోట్లు వెదజల్లాడని, పార్టీ ఫిరాయించిన రాజకీయ వ్యభిచారి అని అందరికీ తెలుసు, కానీ ఆయన ఆ సమయంలో పార్టీకి భారీ ఫండ్‌ ఇచ్చాడు. ఇక ఆయన్ను పార్టీ నుంచి తొలగించడమనేది కేవలం కంటితుడుపు చర్య. మరి అవే ఆరోపణలున్న సుజనా చౌదరిని కేంద్రమంత్రిని ఎందుకు చేశావు? సీఎం రమేష్‌ వంటి వారిని ఎందుకు చేరదీస్తున్నావు? ఆర్ధిక నేరస్థుడని జగన్‌పై మాట్లాడే నువ్వు జగన్‌ నిందితుడే గానీ దోషిగా ఇంకా నిర్ధారణ కాలేదన్న విషయం ఎందుకు విస్మరిస్తున్నాడు? మరి కేంద్ర పెద్దలు, మోదీలు జగన్‌కి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్నే తప్పుపడుతున్న నీవు మాల్యాకు కూడా అపాయింట్‌మెంట్‌ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్న నీవు.. సుజనా చౌదరి వంటి వారిని ఏకంగా కేంద్రమంత్రిని ఎందుకు చేశావు.? 

కేవలం నీ పార్టీని కుల , ఆర్ధికనేరగాళ్లు, ఫిరాయింపు దార్లతో ఎందుకు నింపుతున్నావు? నిన్ను నమ్మి ఓట్లేసిన సామాన్యులకు ఏమి చేస్తున్నావు? పెద్దల సభ సభ్యుడైన వాకాటి ఇలా అడ్డంగా దొరికితే, పెద్దల సభకు విలువేముంది? పొలిటకల్‌ సెటైర్‌లో శాసనమండలిని కించపరిస్తే తప్పేముంది..?ఇకనైనా ఆలోచించుకోవాలి..! 

Chandrababu Naidu How Long Time Give Chance to Robbers?:

When Chandrababu Naidu was once CM, he was known for the name of fire, the rural areas in the villages, taking birth schemes, and raising fears and discipline among employees. But now the root seems to have changed.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ