Advertisementt

ప్రభాస్, అనుష్క ల మధ్య ఏం జరుగుతోంది?

Sat 20th May 2017 02:44 PM
prabhas,anushka,marriage rumors,young rebel star prabhas,rumors on prabhas and anushka  ప్రభాస్, అనుష్క ల మధ్య ఏం జరుగుతోంది?
Marriage Rumors on Prabhas and Anushka ప్రభాస్, అనుష్క ల మధ్య ఏం జరుగుతోంది?
Advertisement
Ads by CJ

సినిమా ఫీల్డ్‌లో ఒక హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్‌ అయినా, ఇద్దరు కలిసి రెండు మూడు చిత్రాలలో నటించి, సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌ అనిపించుకున్నా వారిపై ఎఫైర్ల జోరు మొదలుకావడం ఖాయం. ఇప్పటికీ ఒక్క సినిమా కూడా కలిసి చేయనప్పటికీ వారికున్న వ్యక్తిగత కుటుంబ బంధాల నేపథ్యంలో ఇటీవలే సాయిధరమ్‌తేజ్‌-నిహారికల మధ్య ఎఫైర్‌ ఉందని, త్వరలో వారు ఒకటి కాబోతున్నారని వార్తలు వచ్చాయి. వీటిపై వెంటనే స్పందించిన సాయి తాను ఆమెను సిస్టర్‌గా భావిస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు. 

ఇక ఇప్పటికే 'బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి2'లలో అదరగొట్టిన ప్రభాస్‌-అనుష్కలు ఇష్టపడుతున్నారని, వారు ఇప్పటికీ పెళ్లిళ్లు చేసుకోకపోవడానికి ఇదే కారణమని గత కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. కానీ వారు వాటిని ఇప్పటి వరకు ఖండించలేదు. దీంతో మౌనం అర్ధాంగీకారం అనుకున్నారో ఏమో.. ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఇక 'బాహుబలి2'లో వీరి మధ్య సీన్‌ కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య అదరచుంభనం వంటి వాటిని చూసిన బాలీవుడ్‌ కూడా వారి మాయలో పడిపోయింది. ప్రభాస్‌ నటించే తదుపరి చిత్రం 'సాహో' లో కూడా వీరిద్దరే కలిసి నటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. 

ఇక ఇటీవల అనుష్క ఓఇంటర్వ్యూలో రానా కంటే ప్రభాస్‌ సెక్సీగా ఉంటాడని, రానా తనను సిస్టర్‌ అంటాడని, తాను కూడా బ్రదర్‌ అని పిలుస్తానంది. ఇక ప్రభాస్‌ ఓన్‌ బేనర్‌ వంటి యువి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న 'భాగమతి'లో కూడా కేవలం ప్రభాస్‌ కోసమే అనుష్క నటించడానికి ఒప్పుకుందనే వార్తలు జోరందుకున్నాయి. 

Marriage Rumors on Prabhas and Anushka:

Rumours are part and parcel of glamour industry, but looks like, Devsena from ‘Baahubali’, Anushka Shetty, is unable to make peace with the rumours. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ