యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నిజంగా మంచి నటుడు. ఏ సీన్‌నైనా సింగిల్ టేక్‌లో చేసే హీరో. మంచి నటుడు, డ్యాన్సర్.. ఇలా ఆయన ఆల్‌రౌండర్. కాగా ప్రస్తుతం ఆయన బాబి దర్శకత్వంలో 'జై లవ కుశ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కూడా ఇటీవల ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ప్రస్తుతం దర్శకుల పరిస్థితి ఎలా ఉందంటే... తమ చాన్స్‌ల కోసం హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతూ, ఏ ఎండకా గొడుగు పడుతున్నారు కాగా 'జై లవకుశ' దర్శకుడు బాబి గతంలో రవితేజ, పవన్ కళ్యాణ్‌లతో పనిచేసి ఉన్నాడు.
ఆయా చిత్రాల షూటింగ్‌ల సమయంలో వారిని ఆకాశానికి ఎత్తేసి ఉన్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది కాబట్టి ఆయన ఎన్టీఆర్‌ను ఉద్దేశించి 'వన్ మోర్' అనే అవకాశం ఎన్టీఆర్ తనకు ఇవ్వడం లేదని పొగడ్తలు గుప్పించాడు. గతంలో ఆయన రవితేజ. పవన్‌లతో చేసేటప్పుడు కూడా ఇలాంటి పొగడ్తలనే వారిపై కురిపించిన సంగతి తెలిసే ఉంటుంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ గతంలో ఎన్టీఆర్‌తో 'రామయ్యా వస్తావయ్యా' అనే ఫ్లాప్ చిత్రం చేసి ఉన్నాడు.
ప్రస్తుతం ఆయన దిల్‌రాజు నిర్మాతగా బన్నీతో 'డిజె' చేస్తున్నాడు. ఆయన కూడా గతంలో రవితేజ, పవన్‌లతో పాటు తాజాగా బన్నీపై కూడా పొగడ్తల వర్షం కురిపించాడు. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకుని 'వన్ అండ్ ఓన్లీ సింగిల్ టేక్ హీరో' అంటున్నాడు. త్వరలో ఎన్టీఆర్‌తో హరీష్ ఓ చిత్రం చేసి, తన బాకీ తీర్చుకోనున్నాడు. దీంతో ఆయన వన్ అండ్ ఓన్లీ అనే వివాదాస్పదమైన కామెంట్ చేశాడు.ఇలా మన దర్శకులు తమ టాలెంట్‌ను నమ్ముకోకుండా స్టార్స్‌ని పొగడ్తలతో ముంచెత్తుతూ అవకాశాలు పొందాలని చూస్తుండటం, ఏ హీరోతో అవకాశం ఉంటే వారిని ఆకాశానికి ఎత్తేసి మిగిలిన హీరోలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని విశ్లేషకుల అభిప్రాయం..!