ప్రస్తుతం తమిళనాటే కాదు.. దేశవ్యాప్తంగా రజినీ రాజకీయ అరంగేట్రంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇక ఈ విషయంపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ, రజనీ ముందు సస్పెన్స్ వీడాలని, క్లారిటీ తెచ్చుకోవాలన్నారు. ఆయన వస్తానంటే బిజెపి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మరోసారి తమ కోరికను వెల్లబుచ్చాడు. ఇక తమిళనాడు పిసిసి అధ్యక్షుడు తిరునావుక్కరసు మాట్లాడుతూ, రజనీ తనకు 35ఏళ్లకు పైగా తెలుసునని, ఆయన మనస్తత్వాన్ని తాను బాగా ఎరుగుదునని తెలిపాడు.
రజినీ ఏ జాతీయ పార్టీలోనో, లేక ప్రాంతీయ పార్టీలోనే చేరే అవకాశమే లేదని, ఆయన సొంతంగా ఓ ప్రాంతీయ పార్టీని పెడతారని జోస్యం చెప్పాడు. ఇక ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఆయన ఇష్టమన్నారు. ఇక రజినీ పార్టీ పెట్టిన పక్షంలో డీఎంకే, కాంగ్రెస్‌లతో కలిసి యూపీఏ కూటమిలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రజినీ అండ్ టీం ఇప్పటికే పార్టీ పేరు, పార్టీ జెండా, సింబల్‌లపై కసరత్తు చేస్తున్నారట. మరి రజినీ తన మనసులోని మాటను ఎప్పుడు బయటపెడతాడో వేచిచూడాల్సివుంది...!