త్వరలో తెలంగాణ రానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నాడు. కాగా ఇంతకాలం బిజెపికి హిందూ మతతత్వ పార్టీగా పేరుంది. ఇప్పుడిప్పుడు ట్రిపుల్ తలాఖ్ వంటి విషయాలలో ముస్లిం మహిళల మనస్సులను కూడా దోచుకుంటోంది. కాగా బిజెపిపై ఉన్న మరో మచ్చ ఏమిటంటే.. బిజెపి అగ్రవర్ణాల పార్టీ అని. అదే నిజమైతే బంగారు లక్ష్మణ్ వంటి దళితుడిని దేశ పార్టీ అధ్యక్షునిగా ఎవరైనా చేస్తారా? కానీ బిజెపిని దాని వ్యతిరేక పార్టీలు అగ్రవర్ణపార్టీగా అభివర్ణిస్తున్నాయి.
టిడిపి, వైసీపీ, కాంగ్రెస్.. ఇలా అన్ని పార్టీలలోనూ అగ్రవర్ణాలదే ఆదిపత్యం అయినప్పుడు బిజెపిని మాత్రమే టార్గెట్ చేయడం తగని పని, చివరకు స్వతంత్య్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులను ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ కూడ మాట తప్పాడు. ఇక చిరంజీవి అయితే ఓ దళితుడికి కరచాలనం చేసి తర్వాత చేతిని సబ్బుతో రుద్ది, రుద్ది, దళిత వాసన వదిలించుకున్నాడు.
ఇక బిజెపి కూడా తాము దళితులకు అనుకూలమే అని చెప్పేందుకు ఈ సహపంక్తి భోజనాల ఎత్తుగడకు తెరతీసింది. తాజాగా కర్ణాటకలో బిజెపి నేత యడ్యూరప్ప దళితుల ఇళ్లలో అల్పాహారం తిన్నాడు. కానీ ఆయన దళితుల ఇంటిలో చేసిన టిఫిన్‌ని కాకుండా రెస్టారెంట్ నుంచి ఇడ్లీలు, వడలు పార్శిల్‌తెప్పించుకుని తిన్నాడు. దీనిపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది.