Advertisementt

డీజె సాంగ్స్ ఇంకెలా ఉంటాయో..?

Tue 23rd May 2017 07:55 PM
allu arjun,dj movie,director harish shankar,pooja hegde  డీజె సాంగ్స్ ఇంకెలా ఉంటాయో..?
Allu Arjun DJ Movie Songs Directe Release in Market! డీజె సాంగ్స్ ఇంకెలా ఉంటాయో..?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్  - పూజ హెగ్డే జంటగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'డీజె' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 23న 'డీజె... దువ్వాడ జగన్నాథం' చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రానికి సంబందించిన హడావిడి అప్పుడే మొదలైపోయింది. విడుదలకు కేవలం ఒక నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈ చిత్రానికి సంబందించిన పబ్లిసిటీ కార్యక్రమాలలో భాగంగా డీజె పాటలను ఒక్కొక్కటిగా మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ మధ్యన అలా పాటలన్ని డైరెక్ట్ గా మార్కెట్ లోకి వదిలేసి ఆయా చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని మాత్రం భారీ లెవల్లో చేస్తున్నారు. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేది  అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' చిత్రంతో బాగా క్లిక్ అయ్యింది. ఇక ఇప్పుడు కూడా 'డీజె' చిత్రానికి ఆడియో వేడుక రద్దు చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం గ్రాండ్ గా చెయ్యాలని చిత్ర యూనిట్ ఇలా ఒక్కొక్క పాటని మార్కెట్ లోకి వదులుతున్నారు.

అందులో భాగంగా ఈ సోమవారం వదిలిన  'శ‌ర‌ణం భ‌జే భ‌జే... ' అనే డీజె సాంగ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నే కాక సాధారణ ప్రేక్షకులను కూడా ఉర్రుతలూగిస్తుంది. జొన్నవిత్తుల రాసిన లిరిక్స్‌కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా విజయ్ ప్రకాశ్ పాడిన ఈ పాట మార్కెట్లోకి విడుదలై సినీ అభిమానుల నుంచి మాంచి స్పందన తెచ్చుకుంటుంది. మరి ఈ టైటిల్ సాంగ్ లో అల్లు అర్జున్ కి సంబందించిన అన్ని లుక్స్ ని ఫొటోస్ రూపంలో ప్లే చేస్తూ విజువల్ గా కూడా ఆకట్టుకున్నారు. ఇక డీజె లో అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా అదరగొట్టనున్నాడని పోస్టర్స్ ఫొటోస్ చూస్తుంటే తెలుస్తుంది. అలాగే పూజ హెగ్డేతో కూడా రొమాంటిక్ గా రెచ్చిపోనున్నాడనే విషయం కూడా రివీల్ చేశారు. ఇక మొదటి సాంగ్ కే ఇలా డీజె విధ్వంశం సృష్టిస్తుంటే రాబోయే సాంగ్స్ ఇంకెలా ఉంటాయో అని ఫ్యాన్స్ వెర్రెక్కిపోతున్నారు.

Allu Arjun DJ Movie Songs Directe Release in Market!:

Allu Arjun and Pooja Hegde are getting ready for the release of 'Dj' directed by Harish Shankar.  On June 23rd, the film 'DJ-Duvvada Jagannadham' is being prepared for the release of the movie and it was just beginning.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ