Advertisementt

ఈ బడా నిర్మాతకు అసలు కలసిరావడం లేదు..!

Tue 23rd May 2017 08:39 PM
producer bvsn prasad,pawan kalyan,trivikram,ntr,sukumar,sharwanad,sudheer varma,naga chaitanya  ఈ బడా నిర్మాతకు అసలు కలసిరావడం లేదు..!
BVSN Prasad is Not Come Good Luck ఈ బడా నిర్మాతకు అసలు కలసిరావడం లేదు..!
Advertisement
Ads by CJ

సినిమారంగం చిత్ర విచిత్రమైంది. ఇక్కడ సక్సెస్‌, డబ్బు మాత్రమే జీవిత పరమార్ధం. హిట్లు వస్తే భారీగా ప్రచారం చేస్తారు... అన్నికోట్లు వచ్చాయి. ఇన్ని కోట్లు వచ్చాయని చెబుతుంటారు. ఆ తర్వాత మెల్లగా ఈ చిత్రం వల్ల తమకు లాభాలే రాలేదని, కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అంటుంటారు. ఇక బడా నిర్మాత అయిన బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ విషయానికి వస్తే ఒకానొక సందర్బంలో రాజమౌళి, ప్రభాస్‌ల 'ఛత్రపతి' చిత్రం ఆయన్ను మరలా బిజీ చేసింది.

దాంతో ఆయన్ను ఛత్రపతి ప్రసాద్‌ అని కూడా పిలిచేవారు. ఇక ఆయన పవన్‌ కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో 'అత్తారింటికి దారేది' చిత్రం నిర్మించాడు. పైరసీ లీకవ్వడంతో పాటు పలు కారణాల వల్ల ఆ చిత్రాన్ని అనుకున్న తేదీ కంటే ముందుగా విడుదల చేసేందుకు పవన్‌, త్రివిక్రమ్‌లు సహాయం చేశారు. సినిమా విడుదలైన తర్వాత భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు నెలకొల్పింది. కానీ ప్రసాద్‌ మాత్రం పవన్‌, త్రివిక్రమ్‌లకు ఇవ్వాల్సిన పెడింగ్‌ అమౌంట్‌ను తిరిగి ఇవ్వలేదు.

ఎన్టీఆర్‌-సుకుమార్‌లతో తీసిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం సమయానికి డబ్బులు ఇస్తానని మాట తప్పాడు. దాంతో సాధారణంగా డబ్బుల విషయంలో పెద్ద ఇబ్బందిపెట్టే నైజం లేని పవన్‌, త్రివిక్రమ్‌లు ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. అప్పుడు ఈ వార్త ఓ సంచలనంగా మారింది. ఆ తర్వాత కూడా ప్రసాద్‌ ఆ విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్‌ ఆర్ధిక పరిస్థితి అంత దారుణంగా ఉందని తాను భావించలేదంటూ కాస్త వెటకారంగా మాట్లాడాడు.

ఇక ఆయన ఎన్టీఆర్‌-సుకుమార్‌ల దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకుప్రేమతో' చిత్రం మంచి విజయం సాధించి, 50కోట్ల క్లబ్‌ను దాటినప్పటికీ ఆ చిత్రం వల్ల తనకేమీ మిగలలేదని, దానిని కాస్ట్‌ ఫెయిల్యూర్‌ చిత్రంగా ప్రచారం చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన నాగచైతన్య-సుధీర్‌ వర్మల కాంబినేషనలో వచ్చిన 'దోచెయ్‌' చిత్రం నిజంగానే అతడిని దోచేసింది. ఇక తాజాగా శర్వాంద్‌ హీరోగా చంద్రమోహన్‌ అనే నూతన దర్శకునితో చేసిన 'రాధ' పరిస్థితి అదే. దీంతో మన పెద్దలు చెప్పిన పులి-పిల్లోడు కథ గుర్తుకు రాకమానదు.

BVSN Prasad is Not Come Good Luck:

Cinematography is fantastic. Success here, money is the only life. Hits will be heavily advertised ... everywhere. It is said that these crops were made. When the producer BVSN Prasad came to the fore, Rajamouli and Prabhala's 'Chhatrapati' film was again busy.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ