ఇప్పుడు ఏ భాషలోనైనా భారీ బడ్జెట్ మూవీ మహాభారత గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది. ఇండియాలోనే 1000 అతి భారీ బడ్జెట్ తో తెరెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ కుమార్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముని పాత్రకు ఎంపికయ్యాడు. ఇక మహాభారత లోని ప్రధాన పాత్రలకు మరెవ్వరిని చిత్ర యూనిట్ ఫైనల్ చెయ్యలేదు కానీ కృష్ణుడి పాత్రకి ఒక హీరోని అర్జునుడి పాత్రకి మరో హీరోని ఊహించేసుకుని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు నెటిజన్లు. మరో పక్క మహాభారతంలో నటించమని కొంతమంది తెలుగు హీరోలను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
అయితే తెలుగు హీరోలను ఎవరెవరిని సంప్రదించారో క్లారిటీ లేదుగాని నాగార్జునని మాత్రం మహాభారత టీమ్ సంప్రదించినట్టు నాగార్జునే స్వయంగా చెబుతున్నాడు. తనను కర్ణుడి వేషం వేయాలని మహాభారత యూనిట్ అడిగినట్లు.... పూర్తి స్క్రిప్ట్ నాగ్ చదివినట్టు చెప్పాడు. మహాభారత స్క్రిప్ట్ చాలా బాగుందని కూడా తెలియజేశాడు. అంతేకాకుండా తనకి మహాభారతంలో చిన్న పాత్ర అయినా ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇస్తే తప్పక చేస్తానని వారికీ చెప్పినట్లు చెప్పాడు. అయితే మహాభారతకి సంబందించిన కార్యక్రమాలు పూర్తయ్యాక తన దగ్గరికి రమ్మని తాను చెప్పినట్లు చెప్పాడు. అయితే మీడియా వారు నాగ్ ని మీరు కర్ణుడిగా కంటే కృష్ణుడిగా బాగుంటారు కదా అని ప్రశ్నించగా.... కృష్ణుడి వేషం వేస్తె మీసాలు తీయాల్సి వస్తుందని.... అలా మీసాలు తియ్యడం బాగోదని నవ్వేశాడు . అంటే నాగార్జున రోల్ కూడా మహాభారతంలో కన్ఫర్మ్ అయినట్లే.
నాగార్జున ఒకపక్క హీరోగా బిజీగా ఉంటూనే మరోపక్క తన కొడుకుల సినిమాలకు నిర్మతాగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా వున్నాడు. నాగ చైతన్య తో నిర్మించిన రారండోయ్ వేడుక చూద్దాం విడుదలకు సిద్ధమవుతుండగా... అఖిల్ తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ దశలో వుంది. మరి ఇన్ని పనులతో బిజీ అయిన నాగార్జునకి మహాభారతంలో కూడా నటిస్తే అస్సలు తీరిక దొరకదేమో...!