వాజ్‌పేయ్, అద్వానీలలాగా మోదీ సూటి మనిషి కాదు. ఆయన కూడా కాంగ్రెస్ నాయకులు, అంతకు ముందు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారిలా 'విభజించి పాలించు' అనే రకమని స్పష్టమవుతోంది. దీనికి తాజా ఉదాహరణ తమిళనాడే. తమిళనాడు ప్రజలు ముందు నుంచి జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లకు బద్ద వ్యతిరేకం, మా పాలన మేము చేసుకోగలం.. ప్రాంతీయ పార్టీలనే గద్దెనికిస్తామని, తమకు ద్రవిడ పద్దతులు, యాంటీ హిందీ నినాదమే ముఖ్యమని చెబుతారు.
కానీ జయ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీ విభజించి పాలించుకు సై అన్నారు. దానిలో భాగంగానే పన్నీరు సెల్వంకు ప్రత్యేకంగా హడావుడిగా అపాయింట్‌మెంట్ ఇచ్చి మోదీని సందర్శించేలా చేశారు. ఇప్పుడు పళని స్వామి వంతు వచ్చింది. ఈరోజు ప్రధానిని పళనిస్వామి కలుసుకుని దీర్ఘ మంతనాలు చేశాడు. బయట మాత్రం కేవలం అభివృద్ది పనులు, ప్రాజెక్ట్‌లు, రైతుల రుణమాఫీపైనే చర్చించామని చెబుతున్నా, లోగుట్టు మాత్రం అందరికీ తెలిసిందే. ఇక రజినీ విషయంలో కూడా సుబ్రహ్మణ్యస్వామి చేత నీచమైన మాటలు మాట్లాడిస్తూ త్వరలో రజినీతో మోదీ కలసి చర్చించనున్నాడు. దీనిని ఏమనాలి..?