Advertisementt

తండ్రి ని రాజమౌళి కాపాడగలడా..?

Fri 26th May 2017 10:25 AM
writter vijayendra prasad,ss rajamouli father,srivalli movie,rajamouli voiceover in srivalli  తండ్రి ని రాజమౌళి కాపాడగలడా..?
Rajamouli Voiceover in Srivalli Movie..! తండ్రి ని రాజమౌళి కాపాడగలడా..?
Advertisement
Ads by CJ

రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఎంత పెద్ద స్టార్ రైటేరో అందరికి తెలిసిందే. ఆయనకు ఇక్కడ టాలీవుడ్ లోనే గాక బాలీవుడ్ లో కూడా మంచి పేరుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన ఆయన ఇప్పుడు శ్రీవల్లి అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇప్పుడా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్నో రోజుల నుండి విడుదలకు నోచుకోని శ్రీవల్లి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. శ్రీవల్లి చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కొడుకు స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి వాయిస్ ఓవర్ అందించనున్నాడట. 

నేహా హింగే ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తోంది. రాజీవ్ కనకాల ఓ కీలక పాత్రని పోషిస్తున్న ఈ చిత్రంలోని పాత్రలన్నీ రాజమౌళి వాయిస్ ఓవర్ తో పరిచయం కానున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఇప్పటి వరకు విడుదల ఇబ్బందులు ఎదుర్కుంటున్న శ్రీవల్లి చిత్రం రాజమౌళి వాయిస్ ఓవర్ తోనైనా మంచి క్రేజ్ సంపాదిస్తుందేమో చూడాలి. పెద్ద స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన చిత్రాలేమి ఇప్పటి వరకు హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ శ్రీవల్లి చిత్రం అయినా హిట్ అవుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్.

Rajamouli Voiceover in Srivalli Movie..!:

Rajamouli's father, Vijendra Prasad, knows how big a star writer is. Srivalli has been released for many days and has come up with an interesting story about the movie. Rajamouli Voiceover in srivalli film.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ