Advertisementt

నాగ్‌ మాటల్లో ఏదో మెలిక ఉంది..!

Fri 26th May 2017 11:29 AM
akkineni nagarjuna,raju gari gadhi 2 movie,director omkar,naga chaitanya,akhil  నాగ్‌ మాటల్లో ఏదో మెలిక ఉంది..!
There is A Twist in The Speach Of Nagarjuna..! నాగ్‌ మాటల్లో ఏదో మెలిక ఉంది..!
Advertisement
Ads by CJ

నాగార్జున మాటల్లో ముందు చూపు, జాగ్రత్త ఉంటాయి. ఆయన ఎవరికి ఎప్పుడు ఏమి చెప్పాలో బాగా తెలుసు. కాగా తన తనయుడు నాగచైతన్య నటించిన 'రారండోయ్‌ వేడుకచూద్దాం' చిత్రంతో పాటు అఖిల్‌-విక్రమ్‌ కె.కుమార్‌ల చిత్రం కూడా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని ఆయన ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఉండటమే కాదు.. దానిని పబ్లిగ్గా కూడా చెబుతుండటం ఆయనలోకి కాన్ఫిడెన్స్‌ని తెలియజేస్తోంది. 

ఇక తన చిత్రం 'భాయ్‌' తనకే నచ్చనప్పుడు ఆయన ఆ చిత్రం విడుదల తర్వాత ఆ చిత్రం చూడకండి అని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆయన ఓ మలయాళ మూవీకి మాతృకగా ఓంకార్‌ దర్శకత్వంలో మనిషి మనసులతో ఆటాడుకునే సైకాలజిస్ట్‌ పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రోగ్రెస్‌ విషయంలో మాత్రం నాగ్‌ ఆచితూచి మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌ను, రషెస్‌నిచూసిన తర్వాత తదుపరి షూటింగ్‌ గురించి ఆలోచిస్తానంటున్నాడు. 

ఇటీవలే ఆయన తమకు నచ్చకపోతే తమ చిత్రాన్ని వాయిదా అయినా వేస్తామని, కానీ సంతృప్తి చెందకుండా సినిమాను రిలీజ్‌ చేయమని కుండ బద్దలు కొట్టాడు. మరోవంక నాగ్‌ వంటి సీనియర్‌ను డీల్‌ చేయడం దర్శకుడు ఓంకార్‌కి చేతకావడం లేదనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు నాగార్జునకు ఎంతో కావాల్సిన పివిపి సంస్థ కూడా రాజీ పడేది లేదంటోంది. దీన్నిబట్టి 'రాజుగారి గది-2' విషయంలో రీషూట్‌ చేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. 

There is A Twist in The Speach Of Nagarjuna..!:

In the words of Nagarjuna, be cautious. He knows what to say when he is. He is confident that the film will be a block buster along with the film 'Randhoyi Veduka Chuddam ' and the film will also be a block buster. It is also known as a publisher that tells Confidence.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ