Advertisementt

సామ్, చైతును లెక్క చెయ్యకుండా పోస్ట్ చేసిందట!

Sat 27th May 2017 05:19 PM
samantha,naga chaitanya,nagarjuna,samantha twitter posts  సామ్, చైతును లెక్క చెయ్యకుండా పోస్ట్ చేసిందట!
Samantha Posted Naga Chaitanya Weightlifting Video! సామ్, చైతును లెక్క చెయ్యకుండా పోస్ట్ చేసిందట!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంతలు ఇద్దరూ ప్రేమించుకుని త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత ఏడాది వీరి ప్రేమ వ్యవహారం బయటపడ్డప్పటి నుండి ప్రేమ పక్షుల్లా విహరిస్తూ ఈ ఏడాది ప్రథమార్ధంలో ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చే అక్టోబర్ లో పెళ్లి చేసుకుంటానికి సిద్ధమయ్యారు. అయితే సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తుందని నాగ చైతన్య ఎప్పుడో చెప్పాడు. ఇక నాగ చైతన్య తో లవ్ లో పడిందని తెలిసిన తర్వాత సమంత కు అనూహ్యంగా అవకాశాలు తగ్గిపోయాయి. అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెడుతున్న సమంతకి హీరోయిన్ అవకాశాలు రావనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ఒక్కసారిగా చేతినిండా సినిమాలతో బిజీ అయిపొయింది.

మరి లవ్ బర్డ్స్ లా విహరిసున్న ఈ జంట ని చూసిన వారు మాత్రం మెడ్ ఫర్ఈచ్అదర్ అంటున్నారు. అయితే నాగ చైతన్య కు సమంతలో ఒక నచ్చని విషయం కూడా ఉందట. అదేమిటంటే సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను, తనకు కాబోయే భర్త చైతు ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హడా విడి చెయ్యడం చైతు కి ఇష్టముండదట. కానీ సామ్ మాత్రం చైతు మాటలను లెక్క చెయ్యకుండా వారిద్దరూ కలిసున్న ఫొటోస్ ని తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేస్తుంది. తాజాగా సమంత, నాగ చైతన్య  వెయిట్ లిఫ్టింగ్ వీడియో.... జిమ్ లో 161 కేజీల వెయిట్ ను లిఫ్ట్ చేస్తున్న విజువల్ ను పోస్ట్ చేసింది.

అయితే ఇది చైతు అంగీకారంతోనే జరిగిందట. కానీ అలా చైతు అంగీకారం తెలపడానికి సమంత చాలానే కష్టపడిందట. నేను చైతుని ఎంతో బ్రతిమాలాను, ఎంతో ఫోర్స్ చేశాను. మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చెయ్యడానికి చైతూ ఎట్టకేలకు ఒప్పుకున్నాడు... అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి చైతుని ఒప్పించడమనేది సమంత చాలా సునాయాసంగా చేసేస్తుందన్నమాట.

Samantha Posted Naga Chaitanya Weightlifting Video!:

Naga Chaitanya - Samantha both love him and are going to marry soon. The recently Samantha, Naga Chaitanya Weightlifting video ... posted a Visual  Weightlifting 161 Kg Wait.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ