కొన్ని కొన్నిసార్లు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అలాంటి సమయంలో వారిని నిలువరించాల్సింది పెద్దలే. ఇక విషయానికి వస్తే తానా సభలో పాల్గొంటున్న నందమూరి కళ్యాణ్ రామ్‌ను మీ తమ్ముడు ఎన్టీఆర్ గురించి చెప్పండి అని అక్కడి నందమూరి అభిమానులు పెద్ద పెద్దగా గోలచేశారు. దానికి కాస్త ఆలోచించిన కళ్యాణ్ రామ్ 'ఆటంబాంబు' అన్నాడు. కానీ అభిమానుల్లో ఒకరు 'లెజెండ్' అని అరిచారు. వారిని నందమూరి కళ్యాణ్ రామ్ నిలువరించాడు.
'లెజెండ్' అని పెద్దవాళ్లని, మహానుబాహులనే పిలవాలని, తమ తాత్తయ్య స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమే 'లెజెండ్' అని చెప్పారు. ఆయన్ను గురించి మాట్లాడేటప్పుడే లెజెండ్ అనే పదాన్ని వాడాలని అభిమానులకు సూచించారు. ఇక నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం గురించి చెప్పమనగానే 'దాన్ని నేను కాకుండా బాబాయ్ చెబితేనే బాగుంటుంది. ఎంతైనా పుత్రోత్సాహం ఉంటుంది కదా' అని సమాధానం ఇచ్చాడు. బాబాయ్‌తో ఎప్పుడు కలిసి నటిస్తారు? అని ప్రశ్నించినప్పుడు మంచి కథ దొరికితే బాబాయ్‌తో చేస్తాను. అందుకు అభ్యంతరమేమీ లేదు.
ఏ సినిమా కథ అయినా నాకు, నా మనసుకు నచ్చాలి. హిట్టా,ఫ్లాపా అన్నది పట్టించుకోను. నా మనసుకు నచ్చితేనే సినిమా చేస్తాను, లేకపోతే ఇంట్లో ఉండి పిల్లలతో ఆడుకుంటాను..అని సమాధానం చెప్పాడు. కాగా గతంలో చిరంజీవి 'లెజెండ్' విషయంలో మోహన్‌బాబు 'లెజెండ్'కు 'సెలబ్రిటీ'కి ఉన్న తేడా గురించి వ్యాఖ్యానాలు చేశాడు. ఇప్పుడు 'లెజెండ్' విషయంలో మోహన్ బాబుకు,చిరంజీవి బాలకృష్ణలకు కూడా కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడనే అంటున్నారు.