దేశప్రధాని అయిన తర్వాత మూడేళ్లకు మోదీ పశువధశాలలు, గోహత్యలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాడి, వ్యవసాయ అవసరాలకు తప్ప పశువులను అమ్మడానికి, కొనడానికి వీలులేదని కీలక నిర్ణయం తీసుకున్నాడు. గోవుల చెవుల్లో ఐడి నెంబర్‌తో కూడిన ఆధార్ తరహా చిప్‌లను పెడుతున్నారు. వాస్తవానికి మోదీకి ఈ పని చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. దీనివల్ల వచ్చే రాజకీయ వ్యతిరేకతలు, రాజకీయ ప్రభావాలపై ఆయన డైలమాలో పడ్డారు.
కానీ యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ వచ్చిన వెంటనే ఈ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. రాజకీయంగా ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అనే దానిపై ఆయన ఆలోచన చేయలేదు. కానీ యోగి నిర్ణయానికి అన్నిచోట్లా భారీ మద్దతు లభించింది. దాంతోనే యోగి నిర్ణయాన్ని మోదీ కూడా ఆచరణలో పెట్టాడు. మరోపక్క కేరళ ప్రభుత్వం మాత్రం దీనిపై విమర్శలు చేసింది. కోళ్లు, గొర్రెలు, మేకలు వంటి భారీ ఖర్చుతో కూడిన మాంసాన్ని తినలేని వారికి పశుమాంసమే దిక్కని, కాబట్టి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అంటోంది.
ఇక కుహనా మేధావి, వై ఐ యామ్ నాట్ ఎ హిందు పుస్తక రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య కొత్తగీతం అందుకున్నాడు. బీఫ్ తినడం వల్లే పాకిస్థాన్ వారి ఐక్యూ మన కంటే ఎక్కువగా ఉంటోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్స్ ఐక్యూ కంటే పాకిస్తానీయుల ఐక్యూ తక్కువనేది కంచెకు తెలిసినట్లు లేదు. పశుమాంసం, గోమాంసం తినడం వల్ల కర్కశత్వం, మోటుదనం, మానవత్వం తొలగిపోవడం వంటివి వస్తాయే గానీ ఐక్యూరాదు. ఇక కంచెకు మరో సలహా ఏమిటంటే.. నరమాంసాన్ని తింటే ఇంకా ఐక్యూ బాగా వస్తుందట.
వంద ఏళ్లకు పైగా బతుకుతారట. కాశీలోని అఘోరాలు చెబుతుంటారు. కాబట్టి ఈ రోజు నుంచి ఐలయ్య ఆ తరహా భోజనం చేస్తే ఆనందం. ఇక మన రాజకీయనాయకులు ఎలా ఉన్నారంటే...కేరళకు చెందిన సీపీఎం నేత బాలకృష్ణన్, సైనికులు అనుకుంటే మహిళలను ఎత్తుకెళ్లగలరని, వారిని ఎవ్వరూ ఏమిచేయలేరని, సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడారు. ఆయన్ను కూడా బలవంతంగా మిలట్రీకి పంపాలి