Advertisementt

ప్రభుత్వ సర్వేలను నమ్మకండి కేసీఆర్‌..!

Mon 29th May 2017 12:51 PM
telangana,trs,tdp,ap,chandrababu naidu,kcr,government surveys  ప్రభుత్వ సర్వేలను నమ్మకండి కేసీఆర్‌..!
Do Not Believe Government Surveys KCR! ప్రభుత్వ సర్వేలను నమ్మకండి కేసీఆర్‌..!
Advertisement
Ads by CJ

అధికార పార్టీలు చేసే సర్వేలు ఎలా ఉంటాయో.. వాటి విశ్వసనీయత ఏమిటో అందరికీ తెలుసు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇందిరా గాంధీనే గెలుస్తుందని ప్రభుత్వ సర్వేలు తెలిపాయి. ఇక మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కంటే చంద్రబాబుకు ఎక్కువ సీట్లు వస్తాయని సర్వే వచ్చింది. ఇక అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్ల దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు సానుభూతి పవనాలు వీస్తున్నాయని, ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లితే పూర్తి మెజార్టీ ఖాయమని ప్రభుత్వ సర్వేలు తెలపడంతోనే బాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు. 

కాగా ఇప్పుడు తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తమకు 111 అసెంబ్లీ స్థానాలు, ఎంఐఎంకు 6 స్థానాలు వస్తాయని తేలిదంటున్నాడు. బాబూ.... చంద్రశేఖరా... నీవు అధికారంలో ఉన్నావు కాబట్టి నీకు తక్కువ వస్తాయంటే సర్వే చేసిన వారిని తిడతావనో, లేక ఆత్మస్తుతి కోసమే తప్ప ఇలాంటి బూటకపు సర్వేల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రజలు చాలా తెలివైన వారని, ఎప్పుడు ఎవరికి, ఎలా బుద్ది చెప్పాలో తెలుసునని చెప్పవచ్చు. కాబట్టి నీ పనితీరు మెరుగుపరుచుకో.. అంతేగానీ ఏపీ ప్రజలు కూడా కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారని, తమ రాష్ట్రంలో కూడా కేసీఆర్‌ టిఆర్‌ఎస్‌ను పెడితే అధికారం ఖాయం అనే మాటలను పట్టించుకోవద్దు. 

కాగా తాజాగా అమిత్‌షా, కేసీఆర్‌ల మధ్య జరిగిన మాటల ధూషణల పర్వంలో భాగంగా వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో అటు బిజెపి( ఎన్డీయే) అభ్యర్ధికి గానీ, ఇటు యూపీఏతో పాటు ప్రతిపక్షాలన్నీ కలిపి నిలబట్టే అభ్యర్థికిగానీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలనే కీలకనిర్ణయాన్ని కేసీఆర్‌ తీసుకున్నాడు. మరి మోదీ కేసీఆర్‌ని మరలా ఎలా దారిలోకి తెస్తాడో వేచిచూడాల్సివుంది...! ఇక రాహుల్‌ సంగారెడ్డి పర్యటనపై కేసీఆర్‌ దృష్టి సారించాడు. 

Do Not Believe Government Surveys KCR!:

The Government surveys of the ruling parties are aware of their credibility know to all. Chandrababu had more seats than Chandrababu when he was Chief Minister. Now, Telangana CM Chandrasekhar Rao is also known to have 111 Assembly seats and 6 seats for MIM.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ