Advertisementt

నితిన్‌తో రిస్క్‌ చేస్తున్నారా...?

Mon 29th May 2017 05:42 PM
hero nithiin,nithiin new movie lie,hanu raghavapudi director  నితిన్‌తో రిస్క్‌ చేస్తున్నారా...?
Nithiin Upcoming Movie Lie..! నితిన్‌తో రిస్క్‌ చేస్తున్నారా...?
Advertisement
Ads by CJ

ఒకప్పుడు కెరీర్‌కు హీరోగా వచ్చిన మొదట్లో డ్రీమ్‌బోయ్‌గా నితిన్‌ అందరినీ అలరించాడు. ఆ తర్వాత వరుస మాస్‌ చిత్రాలు, మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించి దెబ్బతిన్నాడు. అయినా ఆయన తన తండ్రికున్న పలుకుబడి, ఆర్దికబలంతో పాటు పవన్‌ సహాయంతో మరలా ట్రాక్‌ ఎక్కాడు. 'ఇష్క్‌'తో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను బాగానే లాగిస్తున్నాడు. మధ్యలో రెండు మూడు దెబ్బలు తగిలినా కూడా 'అ..ఆ'తో 50కోట్లు కొల్లగొట్టాడు. 

కానీ దీని క్రెడిట్‌ మొత్తం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సమంతలకు వెళ్లిపోవడంతో డీలాపడ్డాడు. తన సొంతంగా నానిని మించిన రేంజ్‌కి చేరాలని తపన పడుతున్నాడు. ఆయన తానేమి తప్పు చేసినా నాని చేతికి దొరికిపోతానని తెలుసు. అందుకే హనురాఘవపూడి అనే టాలెంటెడ్‌ డైరెక్టర్‌ను, అందునా నానికి 'కృష్ణగాడి వీరప్రేమగాధ' వంటి హిట్‌నిచ్చిన 14రీల్స్‌ సంస్థతో అదే హనురాఘవపూడి దర్శకత్వంలో 'లై' (అబద్దం) అనే మాస్‌ అండ్‌ వెరైటీ స్టోరీ చేస్తున్నాడు. 

మొత్తానికి సుధాకర్‌రెడ్డి అండతోనే మరోవిధంగానే 14రీల్స్‌ సంస్థ ఈ చిత్రానికి కూడా భారీ బడ్జెట్‌ను పెడుతోంది. దాదాపు 40కోట్ల దాకా బడ్జెట్‌తో 80శాతం షూటింగ్‌ను అమెరికాలో చేశారు. ఇక ఇందులో 'శ్రీ ఆంజనేయం' తర్వాత నితిన్‌ మరోసారి యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో కలిసి నటిస్తున్నాడు. 

కాగా ఇందులో అర్జున్‌ విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని జులై ఆఖరులో గానీ ఆగష్టు 11న గానీ రిలీజ్‌ చేసే అవకాశం ఉందంటున్నారు. కానీ సినిమా అవుట్‌పుట్‌ సరిగా ఉంటేనే విడుదల చేస్తామని, రాజీ పడేది లేదని అందరు నిర్మాతలులాగానే ఈ చిత్ర నిర్మాతలు కూడా చెబుతున్నారు. నితిన్‌ సోలో చిత్రం మీద ఏకంగా 40కోట్లు బడ్జెట్‌ పెట్టడమంటే మరి డేరింగేమరి...! 

Nithiin Upcoming Movie Lie..!:

14 Reels is doing a mass and Variety story called 'Lei' (Lied) directed by Hanu Raghavapudi. Nitin is back with action King Arjun once again. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ