మొన్నామధ్యన తీవ్ర అస్వస్థతో కిమ్స్ లో జాయిన్ అయిన దాసరి నారాయణరావు.... రెండు నెలలు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని... కోలుకున్నాక ఇంటికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే విశ్రాంతి తీసుకుంటున్న దాసరి ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. హై బీపీతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.
అయితే దాసరి నారాయణ రావు వారం క్రితమే కిమ్స్ లో జాయిన్ అయినట్లు.... నాలుగు రోజుల క్రితం ఆయనకు మరోసారి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అధిక రక్తపోటు వల్ల దాసరి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. గత రెండు మూడునెలల్లో ఆయనకు రెండుసార్లు ఆపరేషన్ నిర్వహించారు డాక్టర్స్. మరికొద్ది సేపట్లో దాసరి ఆరోగ్యముపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.