మీడియా అనేది మహాసముద్రం. ఇందులో నిత్యం విద్యార్దులుగా ఉండి, ప్రతి విషయాన్ని జిజ్ఞాసతో తెలుసుకోవాలనే తపనతో ఉండాలే గానీ, మనకి అన్నీ తెలుసు...మేము జర్నలిస్టుం కదా..! అనే అహంభావంతో ఉంటే నవ్వులపాలుగాక తప్పదు. అందుకే గ్రామీణ స్థాయి జర్నలిస్ట్‌ల నుంచి ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్ట్‌లుగా మంచి పేరు తెచ్చుకున్న వారందరూ నిరంతర విద్యార్ధులే. ఇది జర్నలిజంలో మొదటి సూత్రం.
ముఖ్యంగా ఎవరినైనా ఒక ప్రశ్న అడిగేటప్పుడు జర్నలిస్ట్‌లు చాలా హోం వర్క్ చేసుకొని వెళ్లాలి. అంతేగానీ ఏది పడితే అది అడిగితే జర్నలిజమే నవ్వులపాలవుతుంది. ఇక దేశప్రధానుల వంటి వారితో మాట్లాడే టప్పుడు అప్‌డేట్ సమాచారంలో ఉండాలి. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం భారత ప్రధాని మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. ఆయనను నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి చెందిన జర్నలిస్ట్ కెల్లీ తన అత్యుత్సాహంతో ఓ ప్రశ్న అడిగి నిండా బుక్కయిపోయి నవ్వులపాలవుతోంది.
సెయింట్ పీటర్‌బర్గ్స్‌లో శుక్రవారం ప్రదాని మోదీ రష్యా ప్రధాని పుతిన్, జర్నలిస్ట్ కెల్లీలతో విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతల కన్నా ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న మోదీని కెల్లీ మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? అని ఓ ప్రశ్న వేసింది. దాంతో మోదీకి నవ్వాగలలేదు. బిగ్గరగా నవ్వేశాడు. 3.3కోట్ల ఫాలోవర్స్ ఉన్న మోదీని కేవలం 23లక్షల ఫాలోయర్స్ కూడా లేని కెల్లీ ఓ దేశప్రధానిని ఇంత చవకబారు ప్రశ్నను వేయడం ఆమె అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని పలువురు నెటిజన్లు కెల్లీపై జోక్స్ వేస్తున్నారు...!