Advertisementt

క్రిష్ కలల సౌధం కూలిపోబోతుందా..?

Mon 05th Jun 2017 12:52 PM
director krish,kangana ranaut,manikarnika movie,bollywood,director kethan mehatha  క్రిష్ కలల సౌధం కూలిపోబోతుందా..?
Director Krish is The Manikarnika Film Dream Collapse? క్రిష్ కలల సౌధం కూలిపోబోతుందా..?
Advertisement
Ads by CJ

ఎలాగైనా బాలీవుడ్ లో పాగా వెయ్యాలని టాలీవుడ్ దర్శకులు చాలామందే కాచుకుని కూర్చుంటారు. ఇక ఇప్పుడు బాహుబలితో రాజమౌళి బాలీవుడ్ లో జెండా గట్టిగా పాతేశాడు. అయితే ఇప్పుడు డైరెక్టుగా ఎటాక్ చేసే ప్రయాతం చేస్తున్నాడు క్రిష్ జాగర్లమూడి. ఇంతకు ముందే క్రిష్ బాలీవుడ్లోకి ఎంటరయ్యాడు. కానీ క్రిష్ అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు కంగనా రనౌత్ హీరోయిన్ గా ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత కథ ఆధారంగా 'మరణికర్ణిక' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్ స్టార్ చేసే సమయంలో 'మణికర్ణిక' చుట్టూ వివాదాలు చుట్టుముట్టేశాయి.

అయితే 'మణికర్ణిక' టైటిల్ రోల్ పోషిస్తున్న కంగనా ఈ వివాదాలకు కేంద్ర బిందువు కావడం ఇక్కడ విశేషం. కంగనా ఈ వివాదాలకు కారణం ఎలా అంటే రెండేళ్ళ క్రితమే దర్శకుడు కేతన్‌ మెహతా, కంగనా రనౌత్‌తో 'రాణి ఆఫ్‌ ఝాన్సీ: ది వారియర్‌ క్వీన్‌' పేరుతో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా సినిమాని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రాజెక్ట్ కి కంగనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ ఉన్నట్టుండి ఆ ప్రాజెక్ట్ నుండి కంగనా తప్పుకుని దర్శకుడు కేతన్‌ మెహతా కి షాక్ ఇచ్చింది. అక్కడ హ్యాండ్ ఇచ్చిన కంగనా ఇక్కడ క్రిష్ కి ఒకే చెప్పేసింది. అలా మణికర్ణిక కు హీరోయిన్ గా  ఓకె చెప్పడమే కాకుండా నిర్మాణంలో కూడా భాగం పంచుకుంటుంది.

మరి పదేళ్లు కష్టపడి ఝాన్సీ కథంను సిద్ధం చేసిన కేతన్‌ మెహతాని కాదని క్రిష్ కి ఓకె చెప్పిన కంగనా మీద దర్శకుడు కేతన్‌ మెహతా కి ఒళ్ళుమండి కంగనా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడట. ఒకవేళ దర్శకుడు కేతన్‌ మెహతా ఈ మణికర్ణిక చిత్రంపై కేసు వేస్తె గనక. ... ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్న క్రిష్ పరిస్థితి ఏంగాను. కంగనా అంటే లైట్ తీసుకుని వేరే సినిమాలోకి జంప్ అయిపోతుంది. కానీ ఇక్కడ సినిమా సెట్స్ మీదకెళ్ళకుండానే ఆగిపోతే క్రిష్ పని అయిపోతుంది. 

Director Krish is The Manikarnika Film Dream Collapse?:

Anyway, Tollywood directors are going to Bollywood. And now the flag of Rajamouli basted strongly in Bollywood. Krish Jagarlamudi is now planed directly traveling to the bollywood. Now Kangana Ranaut is the heroine of Jhansi Lakshmi Bhai's life story based on the film 'Manikarnika'.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ