Advertisementt

భారీ గెడ్డం... ఫుల్ మేకప్ తో..!!

Mon 05th Jun 2017 01:56 PM
balakrishna,poori,don look leaked,shriya,gang star  భారీ గెడ్డం... ఫుల్ మేకప్ తో..!!
Blakrishna's Don Getup Leaked!! భారీ గెడ్డం... ఫుల్ మేకప్ తో..!!
Advertisement
Ads by CJ

పూరి - బాలయ్యల మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ కోసం పోర్చుగల్ వెళ్లిన మూవీ టీమ్ అక్కడ కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ బిజీ గా వుంది. హీరోయిన్ శ్రియ, బాలకృష్ణల మీద కీలక సన్నివేశాలతో పాటే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా అక్కడ  తెరెకెక్కిస్తారని తెలుస్తుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్ స్టార్ గా కనబడతాడని... ప్రచారం జరుగుతుంది.

ఇంకా టైటిల్ పెట్టుకొని ఈ చిత్రంలో బాలకృష్ణ లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఆ ఫొటోలో గెడ్డం పెంచేసి... ఫుల్ మేకప్ లో బాలకృష్ణ నిజమైన డాన్ లా కనిపిస్తున్నాడు. మరి డాన్ గెటప్ లో ఈ చిత్రంలో బాలకృష్ణ ఉతికి ఆరేస్తాడని మాత్రం బాగా అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు లీకైన బాలకృష్ణ లుక్ ఆ ఫోటోలో బాగా క్లారిటీగా లేదు. మరి ఒరిజినల్ పిక్ లో బాలయ్య ఇంకెలా వెలిగిపోతాడో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ప్రస్తుతానికి నందమూరి ఫాన్స్ మాత్రం ఈ లుక్ తోనే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ డాన్ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తుంది. బాలకృష్ణ పుట్టిన రోజుకి ఒక రోజు ముందే అంటే జూన్ 9 న పూరి - బాలయ్యల ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అంటున్నారు.

Blakrishna's Don Getup Leaked!!:

Balakrishna from his upcoming film has been leaked on net and has gone viral. Balayya is seen in a different wig and thick beard in his new look.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ