నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాలు నాడు రెండే రెండు. ఒకటి 'గీతాంజలి'.. దీనితో నాగ్‌కు యూత్‌లో, లేడీస్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇక రెండోది 'శివ' మాస్‌ను, యూత్‌ను ఓ ఊపు ఊపింది. ఇక 'గీతాంజలి' విషయానికి వస్తే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కళాఖండంలో టైటిల్ రోల్‌ను గిరిజ అనే అల్లరిపిల్ల చేసింది. 'లేచిపోదాం వస్తావా' అంటూ యూత్‌ను కట్టిపడేసింది.
కానీ ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా నటించలేదు. 'హృదయాంజలి' అనే అవార్డు అండ్‌మేసేజ్ ఫిలింలో నటించింది. ఆనాడు ఆమెకున్న క్రేజ్‌కు ఆమె సినీ రంగంలోనే ఉండిఉంటే ఆఫర్లు వెల్లువెత్తేవి. కాగా ఆమె పుట్టింది ఇంగ్లండ్‌లో. తండ్రి కన్నడిగుడు, తల్లి బ్రిటిష్ వనిత. ఇక ఆమెకు భారతదేశం అన్నా ఇక్కడ సంప్రదాయాలన్నా చిన్ననాటి నుంచి మక్కువ ఎక్కువ. అందుకే ఆనాడు భరతనాట్యం నేర్చుకునేందుకు ఇండియా వచ్చి 'గీతాంజలి'లో నటించింది.
ఇక ఎక్కువగా ఆధ్యాత్మిక ఎక్కువైనా ఆమె ఆ తర్వాత స్పిర్చువల్ సైకాలజీలో డాక్టరేట్ సంపాదించింది. పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమానికి తరచుగా వస్తూ ఉంటుంది. ప్రస్తుతం లండన్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తోంది. దటీజ్.. గిరిజ...!