ఈ మధ్యన నాగ చైతన్య నటించిన చిత్రాలు కాస్త వరసబెట్టి హిట్ అవుతుండడంతో నాగ చైతన్య మంచి ఊపుమీదున్నాడు. కెరీర్ మొదలైనప్పుడు లవర్ బాయ్ గా కనబడిన చైతూ మధ్యలో మాస్ చిత్రాలు వెంటపడి దారుణమైన ప్లాపులు చవి చూశాడు. గతంలో కంటే ఇప్పుడే నాగ చైతన్య మార్కెట్ తెలుగులో పెరుగుతూ వస్తుంది. చైతు తాజా చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రంతో నాగ చైతన్య తన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. ఇలా తెలుగులో కరెక్ట్ గా నిలబడ్డాకే కోలీవుడ్ వైపు దృష్టి మరల్చాలనుకుంటున్నాడట చైతు. అందుకే ఇప్పట్లో తమిళంలో సినిమా చెయ్యనని ప్రకటించేశాడు.
ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్న చైతు మాములుగా అయితే ఈ సంవత్సరంలోనే కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందని భావించారంతా... ఎందుకంటే గత ఏడాది 'ప్రేమమ్' చిత్రం ప్రమోషన్ లో భాగంగా.... చైతు అన్ని సక్రమంగా కుదిరితే 2017 లో ఒక తమిళ సినిమాలో నటిస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా తెలుగులో నిలదొక్కుకున్నాకే అటు తమిళంలోకి వెళ్లాలని చైతు భావిస్తున్నాడట.