'బాహుబలి' మూవీలో భల్లాల దేవుడు రానా ఇప్పుడు తానే రాజు, తానే మంత్రి అంటున్నాడు. బాహుబలితో భళ్లాలదేవునిగా నెగెటివ్ పాత్రలో అదరగొట్టి నేషనల్ వైడ్ గా పేరు కొట్టేసిన రానా నటిస్తున్న నేనే రాజు - నేనే మంత్రి చిత్రం పొలిటికల్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. ఇందులో రానా జోగేంద్ర రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టుకుని చాలా రోజులే అయ్యింది. అయితే ఈ రోజు దివంగత రామానాయుడు పుట్టినరోజు కానుకగా 'నేనే రాజు - నేనే నమంత్రి' టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇక 'నేనే రాజు- నేనే మంత్రి' టీజర్ లో సంకెళ్లు వేసి జైల్లోకి తీసుకెళుతున్న రానా ని చూస్తుంటే రానా విజువల్స్ కాస్త ఆసక్తిగానే ఉన్నాయి. ఇక ఇందులో 'నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా.. నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా’ అని రానా చెప్పే డైలాగ్ చూస్తుంటే సినిమాపై మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి.
'చిత్రం, నువ్వు - నేను, జయం' వంటి చిత్రాలు మాత్రమే హిట్ అయినా ఇప్పటి వరకు ఏదో ఒక సినిమాతో డైరెక్టర్ తేజ ప్రేక్షకులకు సహనానికి పరీక్ష పెడుతూనే వున్నాడు. కొన్ని సందేశాత్మక చిత్రాలు చేసినప్పటికీ తేజాని ప్లాపులు మాత్రం వెంటాడుతూనే వున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా రానా హీరోగా, కాజల్ అగర్వాల్, కేథరిన్ లు హీరోయిన్స్ గా 'నేనే రాజు - నేనే మంత్రి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.