Advertisementt

అబ్బ..ఏం ఎంజాయ్ చేస్తున్నారో కదా..!

Fri 09th Jun 2017 12:17 PM
chiranjeevi,china tour,80 batch,radhika sarath kumar,chiranjeevi with surekha  అబ్బ..ఏం ఎంజాయ్ చేస్తున్నారో కదా..!
Chiranjeevi's China Visit Pics Rocking అబ్బ..ఏం ఎంజాయ్ చేస్తున్నారో కదా..!
Advertisement
Ads by CJ

గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో 80 దశకంలో సినిమాల్లోకి వచ్చిన నటీనటులు చాలామంది ప్రతిఏడాది ఎక్కడో ఒకచోట కలిసి థీమ్డ్ పార్టీ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ థీమ్ పార్టీలో ఈ సీనియర్ నటులంతా.. కలిసి మాములుగా ఎంజాయ్ చేయడంలేదు. రాధికా శరత్ కుమార్, సుహాసిని లు సరదాగా స్టార్ట్ చేసిన ఈ పార్టీని ప్రతి ఏడు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ పార్టీను నడిపిస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, గోవా లలో జరిగిన ఈ పార్టీ ఈసారి చైనాకి చేరింది. ఇక చైనా లో చిరంజీవి తన భార్య సురేఖతో జాయిన్ కాగా రాధికా, సుహాసిని, ఖుష్బూ, భాగ్యరాజా తదితరులు కలిసి ఈ పార్టీని చైనాలోని కొన్ని నగరాలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అసలు ఈ పార్టీలో ఇంతకుముందు టాలీవుడ్ నుండి బాలకృష్ణ, వెంకటేష్,రజినీకాంత్ లు కూడా  పాల్గొని మిగతా తారలతో ఎంజాయ్ చేసేవారు. కానీ ఈసారి ఈచైనా పార్టీలో మాత్రం వెంకీ, బాలయ్యలు మిస్ అయ్యారనే చెప్పాలి. ఇక చిరంజీవి అండ్ కో బ్యాచ్ మాత్రం చైనా లోని బీజింగ్, షాంగాయ్, గాంజో వంటి మహానగరాల్లో పర్యటిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు వారి ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ 80  లలో చేసిన బ్యాచ్ మొత్తం టీనేజ్ యువతి యవకులా మారిపోయి ఇలా ఎంజాయ్ చేస్తూ కొత్తతరానికి మార్గదర్శంకంగా నిలుస్తున్నారు. ఇక చిరంజీవి ఈ చైనా టూర్ లో ఉండబట్టే దాసరి నారాయణరావు మృతికి రాలేక అక్కడి నుండి మీడియా ద్వారా సంతాపాన్ని తెలిపిన విషయం తెలిసిందే.

Chiranjeevi's China Visit Pics Rocking:

The reunion of 80s stars was initiated by then top actresses Radhika and Suhasini some years ago. From then on, 80s stars picked out a different location every year and celebrated the occasions. This year's edition of 80s stars was held in China.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ