Advertisementt

'జై లవ కుశ' కి కళ్యాణ్ రామ్ అస్సలు తగ్గట్లే!

Sat 10th Jun 2017 01:25 PM
jr ntr,jai lava kusa,kalyan ram,2 crores palace set  'జై లవ కుశ' కి కళ్యాణ్ రామ్ అస్సలు తగ్గట్లే!
2 Crores set to Jai Lava Kusa 'జై లవ కుశ' కి కళ్యాణ్ రామ్ అస్సలు తగ్గట్లే!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' లో నటిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న 'జై లవ కుశ' చిత్రంకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ని ఈ నెల 21 న విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ కి జోడీలుగా నివేత థామస్, రాశి ఖన్నా, నందిత దాస్ లు నటిస్తున్నారు. విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న 'జై లవ కుశ' కి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు వెనుకాడడం లేదని చెబుతున్నారు. 

సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా రెండు కోట్ల రూపాయలతో భారీగా ప్యాలస్ సెట్‌ని యూనిట్ రెడీ చేస్తోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. 'జై లవ కుశ' కి సంబందించిన ఎక్కువ భాగం షూట్ ఈ ప్యాలస్‌లో జరగనున్నట్లు యూనిట్ చెబుతున్నమాట. ఇక ఇప్పటికే భారీ ఖర్చుతో ఎన్టీఆర్ కోసం మాస్క్ తయారు చెయ్యడానికి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన మేకప్ ఆర్టిస్ట్ వ్యాన్స్ హార్ట్‌వెల్‌ని లాస్ ఏంజిల్స్ నుంచి దీనికోసం ప్రత్యేకంగా రప్పించారు. మరి ఇలాంటి మాస్క్ లో ఎన్టీఆర్ కనిపించే సన్నివేశాలని ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో వేసే సెట్ లోనే చిత్రీకరిస్తారని చెబుతున్నారు. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందించనున్న ఈచిత్రం సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

2 Crores set to Jai Lava Kusa:

2 Crores Palace Set for Jr NTR and Bobby's Jai Lava Kusa Movie.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ