పెళ్లి తర్వాత సమంత యధావిధిగా సినిమాల్లో నటిస్తుందని నాగ చైతన్య ఎప్పుడో సెలవిచ్చాడు. నాగ చతన్య - సమంత ప్రేమ, పెళ్లి అంటూ ఒక పక్కన బిజీగా ఉంటూనే మరోపక్క చేతినిండా సినిమాలతో బిజీ అయ్యింది ఈ జంట. నాగ చైతన్య నటించిన తాజా చిత్రం రారండోయ్ విడుదలకాగా..... మరో సినిమా సెట్స్ మీదుంది. ఇక సమంత అటు తమిళ్ లో విజయ్, విశాల్ తో రెండు సినిమాలు సెట్స్ మీదుండగా... తెలుగులో మూడు సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. మరి అక్టోబర్ 6 న పెళ్లి డేట్ ప్రకటించిన ఈ జంట సినిమా షూటింగ్స్ కి మూడు నెలలు బ్రేక్ ఇవ్వనుంది.
మరి ఈ లోపు సమంత ఒప్పుకున్న తెలుగు సినిమాల్లో 'రాజుగారి గది 2' సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. అలాగే రామ్ చరణ్ తో 'రంగస్థలం' కూడా పెళ్లి నాటికి పూర్తి చేసేస్తుంది. ఇక మిగిలిన 'మహానటి సావిత్రి' సినిమా పెళ్ళికి తీసుకున్న బ్రేక్ అయ్యాకే అంటుంది. ఇక తమిళంలో కూడా విజయ్ సినిమా పూర్తి కావొస్తుంది. ఇక మిగిలింది విశాల్ సినిమానే. ఇకపోతే ఇప్పుడు తాజాగా సమంత తమిళంలో ఒక సినిమాకి సైన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. శివకార్తికేయన్ తో కలిసి సమంత నటించే ఆ సినిమా ఈనెల 16 నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోందని అంటున్నారు.
మరి పెళ్లి తర్వాత కూడా సమంత చేతినిండా సినిమాలతో బోలెడంత బిజీగా వుంది. కానీ నాగ చైతన్య మాత్రం పెళ్ళికి ఇచ్చిన గ్యాప్ తర్వాతే సినిమాలు ఒపుకుంటానని చెబుతున్నాడు. కానీ సమంత మాత్రం సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుంటుంది.