పూరి డైరెక్షన్ లో బాలకృష్ణ 101వ చిత్రం 'పైసా వసూల్' చేస్తున్నాడు. శ్రియ శరణ్, ముస్కాన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న 'పైసా వసూల్' లో కైరా దత్ ఒక ఐటెం సాంగ్ లో చేస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పోర్చుగల్ లో జరుపుకుంటుంది. త్వరలో పోర్చుగల్ షూటింగ్ పూర్తికాగానే చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి పయనమవుతుంది. అయితే 'పైసా వసూల్' చిత్రంలో ఒక పాటని రీమిక్స్ చేయబోతున్నారట. బాలయ్య అప్పట్లో సూపర్ హిట్ పాటైనా 'కొంటె చూపు చెబుతోంది.... కొంటెనవ్వు చెబుతోంది..’ పాటని 'పైసా వసూల్' కోసం రీమిక్స్ చేయబోతున్నారట.
హీరో బాలకృష్ణ పై పూరి జగన్నాధ్ 'కొంటె చూపు చెబుతోంది... కొంటెనవ్వు చెబుతోంది...’ పాటని రీమిక్స్ చేయబోతున్నాడట. అసలు ఇంతకుముందే పాత పాటలను చాలా సినిమాల్లో రీమిక్స్ లు చేసి హిట్ కొట్టారు. అందులోనూ సినిమా వారసులైతే తమ తాతో, బాబాయో, తండ్రో సినిమాల్లో పాటలు తీసుకుని ఒరిజినాలిటీకి ఏమాత్రం తగ్గకుండా రీమిక్స్ లు గట్రా చేస్తుంటారు. మరి బాలకృష్ణ - పూరి ఈ 'కొంటె చూపు చెబుతోంది.... కొంటెనవ్వు చెబుతోంది..’ ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.