సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్ లో 'గౌతమ్ నంద' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్ కి జోడిగా హన్సిక మోత్వానీ, కేథరిన్ లు నటిస్తున్నారు. ఈ సోమవారం గోపీచంద్ పుట్టిన రోజు కానుకగా 'గౌతమ్ నంద' టీజర్ని ని విడుదల చేసింది చిత్ర యూనిట్. 'గౌతమ్ నంద' టీజర్ లో గోపీచంద్ ఫుల్ డబ్బున్న యువకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. చాలా రిచ్ పర్సన్ గానే కాకుండా ఒక మాములు యువకుడి పాత్రలో కూడా గోపీచంద్ ఈ 'గౌతమ్ నంద' టీజర్ లో కనిపిస్తున్నాడు. ఇక 'గౌతమ్ నంద' లో ఒక హీరోయిన్ అయిన హన్సికని మిడిల్ క్లాస్ అమ్మాయిగా చూపించిన సంపత్ నంది మరో హీరోయిన్ కేథరిన్ థెరిస్సాని మాత్రం రిచ్చెస్ట్ మోడరన్ గర్ల్ గా చూపించాడు.
'రచ్చ, బెంగాల్ టైగర్' వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన సంపత్ నంది ఇప్పుడు 'గౌతమ్ నంద' కూడా ఎంతో పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడని అర్ధమవుతూనే వుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా గోపీచంద్ 'గౌతమ్ నంద' మీద అంచనాలు పెంచేలా చేశాయి. మరి 'గౌతమ్ నంద' చిత్రం టీజర్ చూస్తుంటే క్లాస్ సినిమాకి మాస్ టచ్ ఇచ్చారనిపిస్తోంది కదా.. ఇక 'గౌతమ్ నంద' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.