Advertisementt

ఫస్ట్ లుక్ అదిరిందయ్యా... బాసు..!

Tue 13th Jun 2017 07:47 PM
jr ntr,jai lava kusa movie,star maa channel,big boss show,big boss first look  ఫస్ట్ లుక్ అదిరిందయ్యా... బాసు..!
Junior NTR Look In Bigg Boss ఫస్ట్ లుక్ అదిరిందయ్యా... బాసు..!
Advertisement
Ads by CJ

కొన్ని రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరమీద ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారంజరుగుతుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షో ని తెలుగులో చెయ్యడానికి మా టీవీ యాజమాన్యం పూనుకుంది.  అయితే ఈ విషయాన్ని స్టార్  మా ఛానల్ ధృవుకరించగా... ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. ఇక ఈ షో కోసం ఎన్టీఆర్ భారీగా ఫీజ్ తీసుకుంటున్నాడనే ప్రచారమైతే మాములుగా జరగలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా ఎలా ఉండబుతున్నాడో అనే విషయం బిగ్ బాస్ ఫస్ట్ లుక్ లో తెలిసిపోయింది.

ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ ఛైర్‌లో హుందా కూర్చుని లైట్ స్మైల్‌తో ప్రేక్షకులందరికీ కన్నుకొడుతూ దర్శనమిచ్చాడు. మరి ఈ లుక్ లో ఎన్టీఆర్ అదిరిపోయాడనే కామెంట్స్ కూడా పడిపోతున్నాయి. ఎన్టీఆర్‌ని ఇలా ఈ లుక్ లో చూసిన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ఎన్టీఆర్ కి ఎంతో ఎనెర్జీ ఉంటుందని ఆయనతో సన్నిహితంగా మెలిగే వారంతా కితాబునిస్తుంటారు.  సల్మాన్ కున్న పాపులారిటీతో బాలీవుడ్ లో బిగ్ బాస్ రియాలిటీ షో రోజు రోజుకి పాపులారిటీ పెంచుకుంటూ పోతుంది. ఇక ఇక్కడ తెలుగు బుల్లితెరపై ఇప్పటిదాకా టాప్‌ లిస్ట్‌లో వున్న ప్రోగ్రామ్స్‌ తాలూకు టీఆర్పీ రేటింగుల్ని ఎన్టీఆర్‌ కొల్లగొట్టేస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ‘జై లవకుశ’తో బిజీగావున్న ఎన్టీఆర్, మరో రెండు ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాడు. అదే సమయంలో ఇలా బుల్లితెరమీద బిగ్‌బాస్‌కి కాల్షీట్స్ ఇవ్వడం గమనార్హం. ఇప్పటి వరకు వెండితెర మీద నటనతో ఎనర్జీతో విరుచుకుపడే ఎన్టీఆర్ ఇప్పుడు ఇక్కడ బుల్లితెర మీద ఎలాంటి భీభత్సాన్ని సృష్టిస్తాడో చూడాలి.

Junior NTR Look In Bigg Boss:

Junior NTR will be the host for Bigg Boss Telugu version TV reality show. Though the news is old, here is the new surprise because Tarak himself unveiled his first look for the show. No doubts, he is looking dashing and potentially enough to shoulder the show alone. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ