Advertisementt

ఎన్టీఆర్ కి పోటీ దగ్గుబాటి రానా నే..!

Thu 15th Jun 2017 05:10 PM
rana daggubati,no 1 yaari,jr ntr,big boss,rana television show  ఎన్టీఆర్ కి పోటీ దగ్గుబాటి రానా నే..!
Rana Daggubati to debut on television ఎన్టీఆర్ కి పోటీ దగ్గుబాటి రానా నే..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు బుల్లితెర మీదకి బిగ్ బాస్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ సందడి చెయ్యడానికి రెడీ అవుతున్న వేళ మరో హీరో కూడా బుల్లితెర మీద సందడి చెయ్యడానికి తయారైపోయాడు. 'లీడర్' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా తాజాగా 'బాహుబలి'లో భళ్లాలదేవగా ఇరగదీసాడు. ఆ బాడీ లాంగ్వేజ్, మాట తీరుతో భళ్లాలదేవగా ఆకట్టుకున్న రానాకు జాతీయ స్థాయిలో మంచి పేరొచ్చేసింది. ఇక ఇప్పుడు తాజాగా 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రంలో చేస్తున్న రానా ఇప్పుడు బుల్లితెర మీద  నెం. 1 యారీ అంటూ వచ్చేస్తున్నాడు.

జెమిని ఛానల్ లో నెం. 1 యారీ టాక్  షో చెయ్యడానికి రానా రెడీ అయిపోయాడు. ఈ షో చేస్తున్నట్టు రానా తన లుక్ తో పాటే అఫీషియల్ గా ట్విట్టర్ లో అనౌన్స్ చేశాడు. మరి నిన్నటికి నిన్న బిగ్ బాస్ ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ అభిమానులనేకాదు అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు భళ్లాలదేవ వంతు. ఇక ఈ నెం. 1 యారీ షో లో ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ ని ఆహ్వానించి వారితో మాట మంతి కలిపి.... వాళ్ల మనసులోని విషయాలను రానా బుల్లితెర ప్రేక్షకులకు చేరవేయ్యనున్నాడన్న మాట. 

మరి ఈ షో తో రానా సక్సెస్ అవుతాడని జెమినీ ఛానల్ యాజమాన్యం భావిస్తుంది. ఎందుకంటే రానాకున్న వాయిస్ పవర్ తో సెలబ్రిటీస్ ని మెస్మరైజ్ చేసి వారినుండి తెలివిగా విషయాలను రాబట్టి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడని....అంటున్నారు. మరి రానా వాయిస్ లో గ్రెస్ ని మనం  బాహుబలిలో చూసేసాం.  భళ్లాలదేవగా ఎలా ఆకట్టుకున్నాడో తెలిసిందే. అలాగే రీసెంట్ గా ఐఫా అవార్డులలో కూడా కో స్టార్ నాని తో కలిసి హోస్ట్ గా చేసిన రానా అందరి చేత సూపర్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు నెం. 1 యారీ షో ని కూడా వాయిస్ పవర్ తో బాడీ లాంగ్వేజ్ తో రానా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీఅవుతున్నాడన్నమాట.

Rana Daggubati to debut on television:

Rana Daggubati will be debuting on the small screen with his upcoming show titled No 1 Yaari with Rana.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ