Advertisementt

ఆ వార్తలను ఖండించిన నాగ్‌...!

Fri 16th Jun 2017 11:09 AM
akkineni nagarjuna,akhil,sridevi daughters,jhanvi kapoor,khushi kapoor,director vikram k kumar  ఆ వార్తలను ఖండించిన నాగ్‌...!
Nagarjuna Says Sridevi's Daughter Not Akhil Heroine ఆ వార్తలను ఖండించిన నాగ్‌...!
Advertisement
Ads by CJ

తాజాగా నాగార్జున తన చిన్నకుమారుడు అక్కినేని అఖిల్‌ను రీలాంచ్‌గా భావించి, భారీ బడ్జెట్‌తో 'మనం' దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శత్వంలో రెెండో చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్‌కు గ్యాప్‌ వచ్చింది. ఇంకా హీరోయిన్‌ ఫైనల్‌ కాలేదు. హీరోయిన్‌ కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అమ్మాయి అంటే ఫస్ట్‌ ఇంప్రెషన్‌లోనే మేడ్‌ ఫర్‌ ఈజ్‌ అదర్‌ అనేలా, అందరినీ మెస్మరైజ్‌ చేసేలా ఉండాలనే ఏకైక ధ్యేయంతో దర్శకనిర్మాతలు గాలిస్తున్నారు. 

మొదట మేఘా ఆకాష్‌ పేరు వినిపించింది. కానీ ఈ చిత్రంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఆమె నితిన్‌ సరసన 'లై' చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. సో.. అఖిల్‌కు జోడీగా నటించే నటి కొత్త అమ్మాయి లేదా ఇప్పటి వరకు తెలుగులో నటించని అమ్మాయిలా ఉండాలని ఆశ పడుతున్నారు. అలియాభట్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ ఆమెను తీసుకోవడానికి నాగ్‌ సుముఖంగా లేడు. అప్పట్లో అఖిల్‌ మొదటి చిత్రం ప్రారంభం ముందు అలియాభట్‌ని కొందరు బాలీవుడ్‌ జర్నలిస్ట్‌లు అక్కినేని అఖిల్‌ సరసన నటిస్తున్నారా? అని అడిగితే అతనెవరు అని ప్రశ్నించింది. 

చివరకు ఏయన్నార్‌, నాగార్జునలు కూడా తనకు తెలియదని తెలిపింది. ఇక మరోవైపు శ్రీదేవి పెద్దకూతురు జాహ్నవిని గానీ, లేదా రెండో కూతురు ఖుషీని కానీ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నాయి. తాజాగా నాగ్‌ దానిని ఖండించాడు. అలాంటిదేమీ లేదని, తాము అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసే వరకు ఇలాంటి వార్తలు రాయవద్దని చెప్పడంతో ఈ వార్తలకు ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పడుతుందనే భావించాలి..! 

Nagarjuna Says Sridevi's Daughter Not Akhil Heroine:

Rumous were recently triggered that then all India top actress Sridevi's younger daughter Khushi Kapoor would make her debut as a heroine with Akhil's second venture which is on sets now. King Nagarjuna, however, denied the aired reports and made it clear that Khushi Kapoor isn't to be part of Akhil's new film. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ